కాజల్ అగర్వాల్ మను చరిత్ర నుంచి ‘హఠాత్తుగా’ పాటను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

454

యంగ్ హీరో శివ కందుకూరిమను చరిత్ర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నేడు ఈ చిత్రం నుంచి రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా హఠాత్తుగా అనే పాట విడుదలైంది. బ్రేకప్ అనంతరం వచ్చే ఈ పాటలో ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో ఫెయిల్ అయితే వచ్చే కోపం, బాధ, ఆ విషాదం, ఎమోషన్ అంతా కూడా పాటలో కనిపిస్తోంది. గోపీ సుందర్ సిట్యువేషన్‌కు తగ్గట్టుగా మంచి బాణీని అందించారు. రేవంత్ గాత్రం చక్కగా సరిపోయింది. సిరా శ్రీ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శివ కందుకూరి సరసన.. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యన్. శ్రీనివాసరెడ్డి, రాన్ సన్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ శ్రీ వాత్సవ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

వరంగల్ నేపథ్యంలో రాబోతోన్నో ఇంటెన్స్ లవ్ స్టోరీయే మను చరిత్ర. సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు విశేషమైన స్పందన లభించింది.

శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధు నందన్, రఘు, దేవీ శ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షి, గరిమ, లజ్జ శివ, కరణ్, గడ్డం శివ, ప్రదీప్

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు : భరత్ పెదగాని
నిర్మాతలు : యన్. శ్రీనివాసరెడ్డి, రాన్ సన్ జోసెఫ్
బ్యానర్ : యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్
సమర్పణ: కాజల్ అగర్వాల్
సంగీతం : గోపీ సుందర్
డీఓపీ : రాహుల్ శ్రీవాత్సవ
ఆర్ట్ : ఉపెందర్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్స్ : సిరా శ్రీ, కేకే
కొరియోగ్రఫీ : చంద్ర కిరణ్
యాక్షన్ : రియల్ సతీష్, నందు
పీఆర్వో : వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385