HomeCeleb Interviews70 ఎమ్ఎమ్ సినిమా గురించి హీరోయిన్ అక్షత శ్రీనివాస్ ఇంటర్వ్యూ...

70 ఎమ్ఎమ్ సినిమా గురించి హీరోయిన్ అక్షత శ్రీనివాస్ ఇంటర్వ్యూ…

జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.యస్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ 70 ఎమ్‌.ఎమ్‌’. రాజశేఖర్‌, ఖాసీం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అక్షత శ్రీనివాస్ ఇంటర్వ్యూ…

నేను ఈ సినిమాలో జేడీ.చక్రవర్తి గారి వైఫ్ పాత్రలో నటించాను. ఈ సినిమా పేరు గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ పేరులోనే సినిమా కథ ఉంది. దానికి పూర్తి అర్థం సినిమా చూశాకే తెలుస్తుంది.

సినిమా షూటింగ్ సమయంలో జేడీ.చక్రవర్తి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. సాయి కార్తీక్ గారి సంగీతం అంజి గారి సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాతలు చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం 70 ఎమ్ఎమ్. ఈ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. ఆర్.పి. చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ సూపర్బ్ గా ఉంటాయి.

ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన‌ జెడి చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సినిమా ఇది. నాకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకునే చిత్రంగా మా 70 ఎమ్ఎమ్ వుండ‌బోతుంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యాక్షన్‌కు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న ఇది.

ఆదాశర్మ నటిస్తోన్న కొశ్యన్ మార్క్ (?) సినిమాలో మంచి పాత్రలో నటించాను త్వరలో అది విడుదల కానుంది. అలాగే జార్జిరెడ్డి హీరో సందీప్ మాధవ్ తో గంధర్వ సినిమాలో నటిస్తున్నాను. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES