`క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి` వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. `బలుపు`, `ఊపిరి`, `క్షణం` వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సమంత అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…
సమంత అక్కినేని మాట్లాడుతూ – “నాకు టీజర్ చాలా బాగా నచ్చింది. యంగ్ టీమ్ కలసిచేసిన ఓ సినిమా. ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్. ప్రతి ఒక కాన్సెప్ట్ మూవీని ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. టీజర్ మాత్రం చాలా బాగా నచ్చింది. క్యూరియాసిటీ పెరిగింది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంది.
డైరెక్టర్ వెంకట్ రామ్‌జీ మాట్లాడుతూ – “సాధారణంగా ప్రతి సినిమాకు కొంత మంది మెయిన్ పిల్లర్స్ ఉంటారు. ఈ సినిమాలోని అలాంటి పిల్లర్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది పివిపిగారి గురించి. అలాగే సెకండ్ పిల్లర్‌గా స్టోరీ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్‌లో అయినా నేను, శేష్, అబ్బూరి రవిగారు కలిసే ట్రావెల్ చేశాం. మేమే రెండో పిల్లర్‌గా పనిచేశాం. ఇక మూడో పిల్లర్ మా నటీనటులు. శేష్, నవీన్, రెజీనాగారు అద్భుతంగా నటించారు. ఇక నాలుగో పిల్లర్ మా టెక్నికల్ టీమ్. వంశీ, గ్యారీ, శ్రీచరణ్ ఇలా అందరూ నా కోసం పనిచేశారు. వారి ప్రేమను చూశాను. ఇంత మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.
హీరో అడివిశేష్ మాట్లాడుతూ – “మా టీజర్‌ను విడుదల చేయడానికి వచ్చిన సమంతకు థాంక్స్. గూఢచారి సమయంలో ఆమె సపోర్ట్ చేశారు. ఆమెలో పాజిటివ్ వైబ్సే లక్‌గా మారుతున్నాయి. ఇదొక ఎమోషనల్ జర్నీ. క్షణం ముందు వరకు నన్ను అందరూ విలన్‌గా చూశారే తప్ప.. మెయిన్ లీడ్‌గా ఎవరూ చూడలేదు. అలాంటి సందర్భంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పివిపిగారు.. ఆయనకు నా థాంక్స్
నటీనటులు: అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్, పి.ఆర్.ఒ: వంశీ కాకా.