HomeTelugu"జాంభి రెడ్డి" టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!

“జాంభి రెడ్డి” టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!


‘ఓబేబి’ ఫేమ్ తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్న చిత్రం “జాంభి రెడ్డి”. ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంఛ్ కార్యక్రమం డిసెంబర్ 5న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. స్టన్నింగ్ బ్యూటీ సమంత, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరవగా ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, బెక్కం వేణుగోపాల్, వాకాడ అప్పారావు, నటుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందిని రెడ్డి, విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. “జాంభి రెడ్డి” పోస్టర్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయగా టీజర్ ని స్టన్నింగ్ బ్యూటీ సమంత విడుదల చేసారు.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో… హీరో తేజ సజ్జ, హీరోయిన్స్ ఆనంది, దక్ష నగార్కర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, కెమెరామెన్ అనిత్ మాదాడి పాల్గొన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…’టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రశాంత్ వర్మ డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తాడు. తన ఫస్ట్ సినిమాతోనే నేషనల్ ఆవార్డ్ సంపాదించుకున్నాడు. టీజర్ చాలా థ్రిల్లింగ్ గా, ఉత్కంఠ భరితంగా ఉంది. ఇంద్ర మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు తేజ. ఫస్ట్ టైం జాంభి రెడ్డితో హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

స్టన్నింగ్ బ్యూటీ సమంత మాట్లాడుతూ..’జాంభి రెడ్డి టీజర్ అదిరిపోయింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. విజువల్స్, మేకింగ్ వాల్యూస్ సూపర్బ్ గా ఉన్నాయి. నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నాను. కానీ నేను ఎక్సపెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. తేజకీ సినిమా అంటే ప్రాణం. ఎప్పుడు సినెమకోసమే తపిస్తుంటాడు. నేను కూడా సీన్ బాగా చేశానా లేదా అని టెన్షన్ పడుతుంటాను. తేజకుడా అలాగే ఫీలవుతాడు. ఇక ప్రశాంత్ నాకు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ కావాలని హీరోగా తేజకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..’పిలవగానే మా టీజర్ లాంఛ్ కి వచ్చిన అతిధులందరికి నా థాంక్స్. ఈ సినిమాని కరోనాకు ముందు కొంత పార్ట్ షూట్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ని పూర్తి చేసాం. కరోన టైంలో ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. ఆర్టిస్టులు, టెక్నీస్జియన్స్ అందరూ నన్ను సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేస్తూ.. ఈ చిత్రానికి వర్క్ చేశారు..వాళ్లందరికీ నా ధన్యవాదాలు. భారీ బడ్జెట్ తో కూడుకున్న హై కాన్సెప్ట్ బిగ్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ ఇది. హాలీవుడ్ లో జాంబీస్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. తెలుగులో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాను. తెలివిగా తీసాను అని చెప్పాను కానీ ఒక కొత్త ఫిల్మ్ చూశాం అని ప్రేక్షకులు థ్రిల్ అవుతారని గ్యారెంటీగా చెప్పగలను. ఔట్ ఫుట్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ జాంభి రెడ్డి లెవెల్-2 తీయాలని ఉంది. అనేక ట్విస్టులతో సప్రైజ్ గా ఉంటుంది. అ సినిమాకి బెస్ట్ మెకప్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమా చూశాక అందరూ అప్రిషియేట్ చేస్తారు. నిర్మాత రాజ్ శేఖర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దేనికీ వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ, నేను చాలా సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాం. ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ కి మా ఇద్దరి వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది. తేజతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.

హీరో తేజ సజ్జ మాట్లాడుతూ..’ బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా మా ఈ కొత్త సినిమాని సపోర్ట్ చేయడానికు వచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. అలాగే మేము ఏది చెయ్యాలన్న కరెక్ట్ డెసిషన్ కోసం కిరణ్ గారిని అప్రోచ్ అయి సలహాలు తీసుకుంటాం. కొత్త తరహా సినిమాలు కోరుకునే ఆడియెన్స్ కి మా జాంభి రెడ్డి ఒక విజువల్ ఫీస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఫస్ట్ ఈ సినిమా ఐడియా సమంత గారికి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ గా ఫీలయ్యాను. అప్పట్నుంచి మాతో ట్రావెల్ అవుతూ.. సినిమా బాగా వస్తుందా..లేదా అని అడిగి తెలుసుకునేవారు. మా సినిమా ప్రమోషన్ కి రావాలని అడగ్గానే డేట్ టైం చెప్పు వస్తానని చెప్పారు..అలాగే ఇప్పుడు వచ్చి మా టీజర్ లాంచ్ చేసిన సమంతకు నా థాంక్స్ అన్నారు.

తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ జంటగా నటించిన ఈ చిత్రంలో రఘుబాబు, పృద్వి రాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, కెమెరా: అనిత్ మాదాడి, ఎడిటర్: సాయిబాబు తలారి, కొరియోగ్రాఫర్స్: విజయ్, యస్వంత్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి, కాస్ట్యూమ్స్ డిజైనర్: ప్రసన్న దంతులూరి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఏక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమచ్చ, ప్రభ చింతలపాటి, దర్శకత్వం: ప్రశాంత వర్మ, నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES