యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ మూడో చిత్రం “ఏ మాస్టర్ పీస్” అనౌన్స్ మెంట్

136

“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్నారు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ దర్శకుడి గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

‘లైఫ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ దట్ యూ క్రియేట్, యూ ఆర్ ఏ మాస్టర్ పీస్. బట్ హూ ఆర్ యూ. వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎ సూపర్ హీరో మిస్టర్ ఏ’…అంటూ ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా కోట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.