-*పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ “బ్రో” చిత్రాన్ని USA లో రిలీజ్ చేయనున్న “పీపుల్ సినిమాస్”*

97

పవన్ కళ్యాణ్ ,సాయిధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో పి.సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న సినిమా “బ్రో”. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరియు సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.

“బ్రో” ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ అభిమానులకు మంచి సప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ టీజర్.

“బ్రో” సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ “బ్రో” చిత్రాన్ని Usa లో “పీపుల్ సినిమాస్” రిలీజ్ చేయనుంది.

నటీనటులు:
పవన్ కళ్యాణ్
సాయిధరమ్ తేజ్
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వి రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా మరియు సూర్య శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్