ముఖ్య‌గ‌మ‌నిక మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను – బ‌న్నీవాసు

152

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా `ముఖ్య గ‌మ‌నిక‌`. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్ వేణు ముర‌ళీధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాలో లావ‌ణ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `ఆ క‌న్ను చూపుల్లోనా..`కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల రిలీజైన ముఖ్య గ‌మ‌నిక టీజ‌ర్ యూట్యూబ్‌లో 12లక్ష‌ల‌కి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ప్రేక్ష‌కుల్లో ట్రైల‌ర్‌పై మ‌రింత ఇంట్రెస్ట్ క్రియేటైంది…తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను బ్లాక్‌బ‌స్టర్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా…

ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీవాసు మాట్లాడుతూ – “నేను ఈ రోజు ఇక్క‌డికి వ‌చ్చానంటే మొద‌టి కార‌ణం విరాన్..రెండో కార‌ణం ఒక కొత్త టీమ్ అంతా క‌లిసి సినిమా చేశారు కాబ‌ట్టి..నేను, ఈ రోజు గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అని పిలుచుకునే ఐదారు మంది నిర్మాత‌లం అంద‌రం కూడా ఒక‌ రోజు ఇలా వ‌చ్చిన వాళ్ల‌మే..ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌న్స్ చాలా ఉంది. దాని ద్వారా సినిమాను రీచ్ అవ‌డం ఈజీ అయింది.. కాని నేను ఇలాంటి ఒక స్టేజీ మీద నిల‌బ‌డ‌డానికి దాదాపు 17 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా ఓర్పు, క‌ష్టం ఈ రెండింటిని న‌మ్మ‌కున్న ఎవ్వ‌రూ ఫెయిల్ అవ‌లేదు..ఇప్ప‌టికీ ప్ర‌తి రోజు సినిమానే న‌న్ను న‌డిపిస్తుంది..ఇలాంటి త‌పన ఉన్న మ‌రో వ్య‌క్తి విరాన్‌. చాలా యంగ్ ఏజ్ నుండే మాతో పాటు ట్రావెల్ అవుతూ వ‌చ్చాడు. ఆ త‌ర్వాత నాతో పాటు అల్లు అర్జున్‌గారి సినిమా క‌థ‌లు వినేవాడు. బ‌న్నీ గారికి విరాన్ అంటే ఎంత ఇష్ట‌మంటే..ఏదైన క్రొత్త క‌థ వినాల్సి వ‌స్తే విరాన్‌ని కూడా పిల‌వండి అని చెప్పేవారు. విరాన్ హీరో అవుతా అని 9ఏళ్ల క్రిత‌మే నాకు చెప్పాడు..ఈ రోజు త‌న క‌ల నిజ‌మైంది. ఆడియ‌న్స్ విరాన్‌ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. ద‌ర్శ‌కుడు వేణుగారు అంద‌రూ కొత్త వారితో సినిమా తీయ‌డం నిజంగా చాలా గ్రేట్‌..మీ అంద‌రూ త‌ప్ప‌క స‌క్సెస్ అవుతార‌ని న‌మ్ముతున్నాను. సినిమా మంచి స‌క్సెస్ అవ్వాల‌ని, యువ నిర్మాత‌ల‌ను ప్రోత్స‌హించాలని కోరుకుంటున్నాను..నేను కారులో వ‌స్తుంటే బ‌న్నీగారు ఫోన్ చేశారు..ఎక్క‌డికి వెళ్తున్నారు అంటే ఇలా విరాన్ సినిమా ఈవెంట్‌కి వెళ్తున్నాను.. అని చెప్పాను. థ్యాంక్యూ అండీ..మా విరాన్‌ని స‌పోర్ట్ చేయ‌డానికి వెళ్తున్నందుకు అని చెప్పారు. ఈ సినిమా పెద్ద‌ స‌క్సెస్ అయ్యి స‌క్సెస్‌మీట్‌కి కూడా నేను రావాల‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ – “మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన మా వాసు అన్న‌కి నా ధ‌న్య‌వాదాలు. ఎక్క‌డో పాలకొల్లులో పుట్టి ఈ రోజున సినిమా అనే మ‌హా స‌ముద్రంలో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నారంటే అది ఆయ‌న క‌ష్టం వ‌ల్ల‌నే.. ఆయ‌న జ‌ర్నీ ఒక ఇన్స్‌పిరేష‌న్‌..ఆయ‌న వెళ్లిన రూట్ ఒక లెస‌న్‌..ఈ రెండింటిని నేను ఫాలో అవుతున్నాను. ఓర్పుగా ఉంటే త‌ప్ప‌కుండా ఏదో ఒక రోజు స‌క్సెస్ వ‌స్తుంది అన‌డానికి వాసు అన్నే ఉదాహ‌ర‌ణ‌. హీరోగా నాకు అవ‌కాశం ఇచ్చిన మా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌..మీరు ఇలాగే క్రొత్త వారిని ప్రోత్స‌హించాలని కోరుకుంటున్నాను. మంచి పాట‌ల‌తో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ గారికి, ఎంతో స‌పోర్ట్ చేసిన నా కో-ఆర్టిస్టులు లావ‌ణ్య‌,ఆర్య‌న్‌గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ద‌ర్శ‌కుడు వేణు ముర‌ళీధ‌ర్ మాట్లాడుతూ – “ఈ రోజు మా టీం కు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన బ‌న్నీవాసు గారికి మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్. ఈ క‌థ అనుకున్న‌ప్పుడే హీరో క్యారెక్ట‌ర్ కి విరాన్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. చాలా బాగా చేశాడు. అంద‌రూ కొత్త‌వారు అయినా బాగా స‌పోర్ట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రు సినిమాకు స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాతలు రాజ‌శేఖ‌ర్‌, సాయికృష్ణ‌ మాట్లాడుతూ.. ‘మా బేన‌ర్‌లో రూపొందుతున్న ఫ‌స్ట్‌మూవీ `ముఖ్య‌గ‌మ‌నిక`. ట్రైల‌ర్ మీ అంద‌రికీ న‌చ్చింద‌ని భావిస్తున్నాం. అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చిన మా ద‌ర్శ‌కుడు వేణుగారికి, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన కిర‌ణ్ గారికి థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల చేస్తున్నాం..అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య, ఆర్య‌న్ కృష్ణ‌న్, భాషా త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయికృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: శ్రీ‌ను – సిద్ధు.