తెలుగు వాళ్ళుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా ‘వైల్డ్ డాగ్’ – మెగాస్టార్ చిరంజీవి.

466

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఇటీవల ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతకాలమైంది ఇలా లైవ్ లో మనమంతా కలుసుకొని. ఇలా మీ అందరితో మీట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజానికి పత్రికల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి మనం ఇంటరాక్ట్ అవ్వడం మిస్ కావడం లేదు.. కానీ, ఇలా మీ అందరితో మీట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజానికి పత్రికల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి మనం ఇంటరాక్ట్ అవ్వడం మిస్ కావడం లేదు.. కానీ, ఇలా నేరుగా కలుసుకోవడం, మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది.అందుకే ఈ ఆనందాన్ని మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కొత్త కథలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆల్రెడీ ఈ సినిమా గురించి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ నిన్న రాత్రి 9 గంటలకు చిరంజీవి కాల్ చేసి ఈ సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అంటూ పొగిడారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా. ఇంటర్వెల్ కూడా లేకుండా సినిమా చూశాను అని చిరంజీవి గారు అన్నారు థాంక్యూ సో మచ్. అలాగే ప్రెస్ మీట్ పెట్టండి నేను ఈ సినిమా గురించి మాట్లాడాలి అనడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ మాట్లాడుతూ.. ”ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ థాంక్స్. ఇకాడికి మనమంతా రావడానికి కారణం నిన్న రాత్రి చిరంజీవి గారు ఈ సినిమా చూసి బాగుందని ట్వీట్ చేయడం. నిజంగా నాకు ఈ రోజు ఎంతో పరిపూర్ణం. వైల్డ్ డాగ్ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అన్నారు.

చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ”సినిమా గురించి ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒకేఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. నిన్న చిరంజీవి గారు ఫోన్ చేసి ఈ సినిమాను ప్రశంసించారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసినప్పుడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీ అని వేసుకున్నాం. కానీ నిన్న చిరంజీవి కాల్ చేశాక ఇక తదుపరి సినిమాకు మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీతో పాటు వైల్డ్ డాగ్ అని వేసుకుంటాం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థాంక్యూ సో మచ్” అన్నారు.