ఆడవాళ్లు మీకు జోహార్లు` రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల

672


శర్వానంద్, రష్మిక మందన్న జంట‌గా ఫస్ట్ టైం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం

ఈ రోజు (ఏప్రిల్ 5) హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ..

పసుపు రంగు చీర కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ గార్డెన్ లో కూర్చొని దేవుడి కోసం బంతిపూలదండ క‌డుతున్న ర‌ష్మిక మంద‌న్న లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి సంభందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385