డా. రాజేంద్రప్రసాద్ నటించిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 22 న విడుదల కానుంది . విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించారు. విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.
నిర్మాత దుర్గాప్రసాద్ మాగంటి మాట్లాడుతూ ”ఒక కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వంటి భావోద్వేగాల కలబోత ఈ చిత్రం. ఒక కుర్రాడు ఇంత లోతైన, ఉద్వేగభరితమైన భావాలున్న కుటుంబ కథని ఎలా ఎదుర్కొని, పరిష్కరించాడు అని రేపు తెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్ ఫీలవుతారు. ఏ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా అందరి హృదయాల్లో స్థానం సంపాదిస్తుందని మా నమ్మకం. ఇటీవల విడుదలయిన ట్రైలర్ కి మరియు పాటలకి మంచి స్పందన లభించింది . ఓవర్సీస్ విడుదల హక్కులను గోల్డెన్ ఈగిల్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.సి వారు పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు ” అని చెప్పారు.
నటీనటులు:
డా. రాజేంద్రప్రసాద్ , విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్
సంగీత, కల్పన, శిరీష సౌగంద్, ధన్‌రాజ్, పూజా రామచంద్రన్, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ‘తాగుబోతు’ రమేష్, ‘బస్టాప్’ కోటేశ్వరరావు, అల్లు రమేష్ తదితరులు.
సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: మోహన్.కె.తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ నూకవల్లి