విక్ర‌మ్‌లో కామెడీ, పాట‌లు ఏమీ లేవు.ద‌ర్శ‌కుని స్రీన్ల్‌ప్లే కార‌ణం – శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి

415

కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్‌` జూన్‌3న విడుద‌లై విశ్వ‌వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. తెలుగు, త‌మిళ రాష్ట్రాల లోనూ క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ సుధాకర్ రెడ్డి త‌మ స్వంత బేన‌ర్‌ శ్రేష్ఠ్ మూవీస్‌ ద్వారా విడుద‌ల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి స‌క్సెస్‌ను సాధించారు. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు సుధాకర్ రెడ్డి మీడియా స‌మావేశంలో త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ, ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.

`విక్ర‌మ్‌` తీసుకున్న‌ప్పుడు మీరేమ‌నుకున్నారు? ఇప్పుడు ఎలా వుంది?
క‌మ‌ల్ హాస‌న్ అభిమాని అయిన‌ ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖ‌చ్చితంగా మంచి సినిమా అనే న‌మ్మ‌కం క‌లిగింది. ఒక అభిమాని ద‌ర్శ‌కుడు అయి సినిమా తీస్తే ఎలా వుంటుంద‌నేది హ‌రీష్ శంక‌ర్ ద్వారా తెలుసుకున్నాం. అప్ప‌టికే ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ రెండు హిట్ సినిమాలు ఇచ్చాడు. కాబట్టి విక్ర‌మ్ మ‌న‌మే రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నాం. క‌మ‌ల్ గారు మ‌మ్మ‌ల్ని న‌మ్మి ఇచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది.

సినిమా చూసి తీసుకున్నారా?
సినిమా చూడ‌లేదు. కేవ‌లం ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో తీసుకున్నాం.

విక్ర‌మ్ సినిమా తీసుకోవ‌డానికి ఇద్ద‌రు, ముగ్గురు పేర్లు వినిపించాయి. క‌మ‌ల్‌ గారు కూడా సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ అయితే బాగుంటుంద‌ని అనుకున్నారు.. మీకు ద‌క్క‌డం ఎలా అనిపించింది?
ఇద్ద‌రు, ముగ్గురు పోటీకి వ‌చ్చారు. కానీ ఆయ‌న మాపై న‌మ్మ‌కంతో మాకు త‌క్కువ‌గానే ఇచ్చారు. ఈ సినిమాను 370 నుంచి 400 స్క్రీన్ల‌లో వేశాం. థియేట‌ర్లు పెర‌గ‌లేదుకానీ మ‌ల్టీప్లెక్స్ షోలు పెరిగాయి. మౌత్ టాక్‌ తో మొద‌టిరోజు నుంచే క‌లెక్ష‌న్లు బాగున్నాయి. నేటికీ అలానే వున్నాయి.

విక్ర‌మ్ క‌థ గురించి తెలుసుకున్నారా? మ‌రి పోటీ ప‌డి తీసుకోవ‌డానికి కార‌ణం?
ఇది ద‌ర్శ‌కుడి సినిమా. ద‌ర్శ‌కుడు స్ట‌ఫ్ నాకు బాగా తెలుసు. పైగా క‌మ‌ల్ హాస‌న్ గారి స్వంత బేన‌ర్ రాజ్‌ క‌మ‌ల్ సంస్థలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీశారు. ఇంకోవైపు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి ప్ర‌ముఖుల కాంబినేష‌న్‌కూడా ఓ కార‌ణం.

క‌మ‌ల్ హాస‌న్ కు ఈమ‌ధ్య స‌క్సెస్ లేవుక‌దా. విక్ర‌మ్ కు రిస్క్ వుంటుంద‌ని అనుకున్నారా?
20 శాతం రిస్క్ వుంటుంద‌నే తీసుకున్నాం.

మీ నిర్ణ‌యం ఇప్పుడు క‌రెక్ట్ అనుకుంటున్నారా?
అవును. మంచి నిర్ణ‌యం తీసుకున్నామ‌నిపించింది. నేటికి 80 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. ఎం.జి. బేస్‌మీద తీసుకున్నాం కాబ‌ట్టి కొంత షేర్ క‌మ‌ల్‌ గారికి ఇవ్వాలి. ఆయ‌న హ్యాపీ, మేమూ హ్యాపీ, ఎగ్జిబిట‌ర్లు హ్యాపీ.

తెలుగు ప‌రిశ్ర‌మ క్లిప్ట‌ప‌రిస్థితిలో వుంది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. అలాంటి టైంలో డ‌బ్బింగ్ సినిమా రిలీజ్ ఎలా చేయాల‌నిపించింది?
ముఖ్యంగా ద‌ర్శ‌కుడు అంత‌కుముందు తీసిన‌, ఖైదీ, మాస్ట‌ర్ సినిమా చూశాక నాకు మంచి న‌మ్మ‌కం వ‌చ్చింది. దానికితోడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వున్నారంటే పెద్ద సినిమా అవుతుంద‌ని న‌మ్మ‌కం క‌లిగింది.

నితిన్ స‌ల‌హా ఇచ్చారా?
ట్రైల‌ర్ చూశాక తీసుకోండి డాడీ అన్నారు.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
80 శాతం పూర్త‌యింది. మ‌రోవైపు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలోని చిత్రం ఆగష్టు లో షూట్ చేయ‌నున్నాం. ఇప్ప‌టికే సాంగ్ చేశాం.

హీరో నితిన్ కెరీర్ గ్రాఫ్ ఎత్తుప‌ల్లాలు వున్నాయి? తండ్రిగా మీ ఫీలింగ్‌?
ఎత్తుప‌ల్లాలు స‌హ‌జం. అందుకే స్వంత బేన‌ర్‌ లో సినిమాలు చేసుకుంటున్నాం. బ‌డ్జెట్ కూడా మ‌న‌మే వేసుకోవ‌డానికి వీలుంటుంది. ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చు. రెండు కోట్లు పెట్టి యాక్ష‌న్ తీయాల‌నుకోండి. వేరే నిర్మాత అయితే ఎందుకంత అంటూ నామీద పెట్టి బ్లేమ్ చేస్తారు. అదే నా సినిమా అనుకో ఆ ఇబ్బంది వుండ‌దు.

విక్ర‌మ్ ప్రీ రిలీజ్ లో క‌మ‌ల్‌ గారు నితిన్ గురించి చేసిన సూచ‌న మీకేమ‌నిపంచింది?
క‌మ‌ల్‌గారు చెప్పిన‌ట్లుగానే నితిన్ క‌ష్ట‌ప‌డుతూనే వున్నాడు. దేనికైనా అదృష్టం క‌లిసిరావాలి. మంచి ప్లానింగ్‌ లోనే వెళుతున్నాం.

శ్రేష్ఠ్ మూవీస్ లో నిర్ణ‌యాలు మీవా? నిఖిత‌ గారివా?
ఇద్ద‌రం బేన‌ర్‌ ను చూసుకుంటాం. ఎగ్జిక్యూష‌న్‌, కాస్ట్యూమ్స్ త‌ను చూసుకుంటుంది. మిగిలిన వ్య‌వ‌హారాలు నేను చూసుకుంటా.

మీ బేన‌ర్‌ లో కొత్త సినిమాలు?
ఇప్పుడు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అయింది. త‌ర్వాత వ‌క్కంతం వంశీ సినిమా వుంది. సురేంద‌ర్ రెడ్డితో మ‌రో సినిమా.

పాన్ ఇండియా స్థాయిలో నితిన్‌తో సినిమా ఆలోచ‌న వుందా?
అలా వెళ్ళాలంటే క‌థ కుద‌రాలి. అదృష్టం కావాలి. అన్నీ అనుకుంటే కావుక‌దా. దానికి స‌రిపడా మ‌ల్టీ సార్స్ వుండాలి. అవ‌కాశం వుంటే చేయొచ్చు.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385