“ఓ మంచి రోజు చూసి చెప్తా” ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 2న సినిమా విడుదల

519

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది. మా చిత్రం సెన్సార్ అయ్యింది, సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు. మా చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.

చిత్రం పేరు : ఓ మంచి రోజు చూసి చెప్తా

బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్

నటి నటులు : విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల, గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు

సంగీతం : జస్టిన్ ప్రభాకరన్

కెమెరా : శ్రీ శరవణన్

ఎడిటర్ : అర్ గోవింద్ రాజ్

పి అర్ ఓ : పాల్ పవన్