పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథే ‘విజయ్ సేతుపతి’ దర్శకుడు విజయ్ చందర్ ఈ నెల 15న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ‘విజయ్ సేతుపతి’.

516

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘సంగ తమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ నెల 15 న విడుదల చేయనున్నారు. ఈ జనరేషన్ హీరోలలో ‘విజయ్ సేతుపతి’కి
ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ సేతుపతి మూవీ తమిళ, తెలుగులలో ఒకేసారి రిలీజ్ అవుతున్న మూవీ ‘విజయ్ సేతుపతి’. తెలుగు నేటివిటీ కి సరిపోయే కథా, కథనాలతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలసి వస్తున్న ‘విజయ్ సేతుపతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. నాజర్, నివేద పేతురాజ్ అశుతోష్ రాణా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ విజయ్ సేతుపతి ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని చిత్రయూనిట్ నమ్మకం. విద్యా వేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రావూరి. వి. శ్రీనివాస్ తన తోటి విద్యావేత్తలు కంచర్ల శ్రీకాంత్ చౌదరి, ప్రకాష్ రెడ్డి, చక్రవర్తి, వెంకట రాజు దంపతుల చేతుల మీదుగా ‘ విజయ్ సేతుపతి’ పాటలను విడుదల చేయించారు. తమ సహా విద్యావేత్త నిర్మాతగా సక్సెస్ అవ్వాలని అతిథులు కోరుకున్నారు. సీనియర్ద ర్శకుడు సముద్ర ట్రైలర్ ని లాంచ్ చేయగా , డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ రెడ్డి, సతీష్ , సజ్జులు టీజర్ ని లాంచ్ చేసారు.

నగేష్ నారదాసి మాట్లాడుతూ: ‘ అందరి పేరులోని విజయం సినిమా రిజల్ట్స్ లో కనిపించాలి. ప్రేక్షకులకు బాష తో పనిలేదు సినిమా బాగుంటే తప్పకుండా పెద్ద విజయం అందిస్తారు. రీసెంట్ గా వచ్చిన ఖైదీ, విజిల్ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో చూసాం. అదే దారిలో విజయ్ సేతుపతి కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ‘విజయ్ సేతుపతి’లో పుష్కలంగా ఉన్నాయి.’ అన్నారు.

ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ: ‘ఎప్పటినుండో సినిమా రంగంలోకి రావాలని అనుకుంటున్నాను. స్ట్రైయిట్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న టైం లో మిత్రుడు వెంకట్ ద్వారా ఈ సినిమా గురించిలుసుకున్నాను. విజయా ప్రొడక్షన్ వారిని కలుసుకొని ఈసినిమా తెలుగు రైట్స్ ని పొందాను. ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు
ఆనందంగా ఉంది. దర్శకుడు విజయ్, మ్యూజిక్ దర్శకుడు వివేక్ – మెర్విన్ చాలా బాగా పనిచేసారు. అచ్చ తెలుగు సినిమా లాగానే ‘విజయ్ సేతుపతి’ ఉంటుంది ’ అన్నారు.

దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ: ‘తెలుగు సినిమాలాగా ‘విజయ్ సేతుపతి’ ఉందని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్
కోసం రాసుకున్న కథ. ఎ యమ్ రత్నం గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందనే వార్తల వస్తున్నప్పుడు ఎ యమ్ రత్నం గారికి ఈ కథను చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం తో ఆ ప్రయత్నం నేరవేరలేదు. తర్వాత విజయా ప్రొడక్షన్ వారికి ఈ కథను చెప్పడం జరిగింది వారికి కథ నచ్చడంతో విజయ్ సేతుపతి ని సజెస్ట్ చేసారు. విజయ్ సేతుపతి ఈ కథ వినగానే చాలా మాస్ ఎలిమెంట్స్ తో కథ ఉంది అని మెచ్చుకున్నారు. తమిళంలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఈ కథను ఆయన బాగా ఎంజయ్ చేసి చేసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.

నటీ నటులు: విజయసేతుపతి, రాశీఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా,రవికిషన్
శుక్లా, తులసి తదితరులు

సాంకేతిక వర్గం : సంగీతం: వివేక్ – మెర్విన్, సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్, స్టంట్స్: అనల్ అరసు, కోరియోగ్రాఫీ: రాజుసుందరం, శాండి, దస్త, ఎడిటింగ్ : ప్రవీణ్ కె. ఎల్. డైలాగ్స్: మల్లూరి వెంకట్, నిర్మాత రావురి. వి. శ్రీనివాస్, దర్శకత్వం: విజయ చందర్