‘వేయి శుభములు కలుగు నీకు’ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన హీరో నాని

616

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం “వెయ్యి శుభములు కలుగు నీకు”. హీరో నాని ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ని మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో శివాజీ రాజా మాట్లాడుతూ “జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరో గా నటిస్తున్న చిత్రానికి “వెయ్యి శుభములు కలుగు నీకు” అని నామకారమం చేసారు. హీరో నాగ శౌర్య క్లాప్ తో మొదలైన ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో ను మరియు మోషన్ పోస్టర్ ను హీరో నాని విడుదల చేసారు, వారికి నా ధన్యవాదాలు. మా అబ్బాయి విజయ్ రాజా కి మంచి నిర్మాత మరియు మంచి దర్శకుడు దొరికారు, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సెప్టెంబర్ లో వైజాగ్ మరియు అరకు ప్రాంతం లో షూటింగ్ జరుపుకుంటుంది. నన్ను ఆశీర్వదించి నాటే నా కుమారుడు ని కూడా ఆశీర్వదించండి” అన్ని కోరుకున్నారు.

నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ “జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ పై ఇది మా మొదటి సినిమా. 30 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. సినిమా బాగా వస్తుంది. ఈరోజు సినిమా టైటిల్ “వెయ్యి శుభములు కలుగు నీకు” పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన హీరో నాని గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరో విజయ్ రాజా మాట్లాడుతూ “ఈ సినిమా కి నన్ను హీరో గా పెట్టుకున్న మా దర్శకుడు రామ్స్ రాథోడ్ గారికి మరియు మా నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. నెల రోజులు గా కరోనా ను జయంచి మేము షూటింగ్ చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డే నాకు, హీరో నాని మా చిత్రం టైటిల్ పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ “శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా గారికి ఈ కరోనా టైం లో మాకు డేట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క రోజు గ్యాప్ లేకుండా క్రమశిక్షణతో ఏకధాటిగా షూటింగ్ చేసాము. మా సినిమా కి హీరో నాగ శౌర్య క్లాప్ ఇస్తే, ఈ రోజు హీరో నాని గారు మా చిత్రం “వెయ్యి శుభములు కలుగు నీకు” టైటిల్ లోగో ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు, వారికీ నా ధన్యవాదాలు. మా నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి సినిమాలు అంటే ప్యాషన్. మంచి నిర్మాత దొరికాడు మాకు. ఎక్కడ ఇబ్బంది పడకుండా సినిమా ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మా సినిమా టైటిల్ లాగానే ప్రేక్షకులందరూ మా టీం ని మా సినిమా ని లక్షల శుభాలతో మమ్మల్ని ఆశీర్వదించలి” అని కోరుకున్నారు.

నటి నటులు :

బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
టైటిల్ : వెయ్యి శుభములు కలుగు నీకు

విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, గడ్డి సుబ్బా రావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు.

కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని సింగ్
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిషోర్ కుమార్
ఎడిటర్ :వినోద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
నిర్మాత : తూము నరసింహ పటేల్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్