శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ క్వశ్చన్ మార్క్ (?).

497

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?). చిత్రం టైటిల్ కి విశేష స్పందన లభించింది. షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకుంది.

ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్ గా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకుంది. ఈ కరోనా సమయం లో అని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారం తో సినిమా షూటింగ్ పూర్తి చేశాను . మా సినిమా టైటిల్ క్వశ్చన్ మార్క్ (?). టైటిల్ అందరికీ చాలా బాగా నచ్చింది విశేష స్పందన లభించింది. షూటింగ్ మొత్తం హైదరాబాద్ మరియు మహారాజపురం అడవుల్లో చేసాము. మా టైటిల్ లాగానే సినిమా కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది ” అని తెలిపారు.

దర్శకుడు విప్రా మాట్లాడుతూ “శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం గౌరీ కృష్ణ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). షూటింగ్ అంత పూర్తీ అయ్యింది. మా నిర్మాత గౌరీ కృష్ణ గారు ఎక్కడ కంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ “ఇది మంచి హారర్ సినిమా. చాలా బాగా వచ్చింది, షూటింగ్ మొత్తం పూర్తీ అయింది. ఈ చిత్రానికి క్వశ్చన్ మార్క్ (?) టైటిల్ పర్ఫెక్ట్. క్వశ్చన్ మార్క్ (?) ఏంటి దాని వెనుక కథ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నాకు ఇంత మంచి సినిమా లో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విప్రా మరియు నిర్మాత గౌరీ కృష్ణ కి ధన్యవాదాలు” అని తెలిపారు.

బ్యానర్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
టైటిల్ : క్వశ్చన్ మార్క్ (?)
Heroine : Adah Sharma
కెమెరా : వంశీ ప్రకాష్
ఎడిటర్ : ఉద్ధవ్
సంగీత దర్శకుడు : రఘు కుంచె
ఆర్ట్ డైరెక్టర్ : ఉప్పెందర్ రెడ్డి
పి ఆర్ ఓ : వంగల కుమారా స్వామి
నిర్మాత : గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం : విప్రా