హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా గచ్చిబౌలిలో ‘వయోలెట్ ఎర డెంటల్ సొల్యూషన్స్ క్లినిక్’ ప్రారంభం

259


హైదరాబాద్‌, గచ్చిబౌలిలో సరికొత్త టెక్నాలజీతో డాక్టర్ హరీష్ తెన్నేటి, డాక్టర్ నిమ్షిక స్థాపించిన ‘వయోలెట్ ఎర డెంటల్ సొల్యూషన్స్ క్లినిక్’ని హీరో శ్రీకాంత్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘వయోలెట్ ఎర డెంటల్ క్లినిక్‌ను ప్రారంభించడం జరిగింది. హరీష్ అలాగే అతని భార్య కూడా డెంటల్ డాక్టర్ కావడంతో వారిద్దరూ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఈ క్లినిక్‌ను స్టార్ట్ చేశారు. నేను కూడా ఇంత వరకు వినలేదు.. డెంటల్‌కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా 72 గంటల్లో క్లియర్ చేయడమనే విషయం. వీరు చేస్తున్న ఈ ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు.