HomeTeluguగ‌ని కోసం ప్రాణం పెట్టాడు నా బ్ర‌ద‌ర్ వ‌రుణ్ తేజ్ - గ‌ని గ్రాండ్ ప్రిరిలీజ్...

గ‌ని కోసం ప్రాణం పెట్టాడు నా బ్ర‌ద‌ర్ వ‌రుణ్ తేజ్ – గ‌ని గ్రాండ్ ప్రిరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ రాజమౌళి గారి తర్వాత తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి తీసుకొచ్చాడు బన్నీ. ప్రౌడ్ అఫ్ యు అల్లు అర్జున్ గారు.. మీతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమా గురించి చెప్పాలి. నిర్మాత అల్లు బాబీ మొహమాటం లేని మనిషి.. ఏదైనా మొహం మీద ఖచ్చితంగా చెప్తాడు. ఆయన జడ్జిమెంట్ పై నాకు నమ్మకం ఉంది. ఇక సిద్దు ముద్ద అందరికి కావాల్సిన వాడు. ఆయన నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరూ కలిసి గని సినిమాను ఎంతో అద్భుతంగా నిర్మించారో విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. కిరణ్ నా దగ్గర మిరపకాయ సినిమాకు కో డైరెక్టర్ గా పని చేశాడు. సెట్ లో ఎంత టెన్షన్ ఉన్న చాలా ప్రశాంతంగా ఉంటాడు. వీళ్లందరినీ నడిపించిన అల్లు అరవింద్ గారి గురించి చెప్పాలి. ఆయన వయసును ఎక్కడ దాచి పెడుతున్నారో తెలియడం లేదు. ఏ వయసు వాళ్ళకు తగ్గట్టు అలా మారిపోతుంటారు ఆయన. ఇప్పటికీ అలాగే ఆలోచిస్తూ ఉంటారు. గని సినిమాకు ఆయన సహకారం చాలా లాభం చేకూరుస్తుంది. తమన్ అన్ని పాటలు ఇరగ్గొట్టాడు. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది..’ అని తెలిపారు.

హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ..’ అల్లు అర్జున్ గారితో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కిరణ్.. హీరో వరుణ్.. నిర్మాతలు అల్లు బాబి గారు, సిద్దు ముద్ద గారు, అల్లు అరవింద్ గారికి స్పెషల్ థాంక్స్..’ అని తెలిపారు.

గని’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. ‘ ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడే తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా కథ ఓకే అయ్యింది. షూటింగ్ కూడా ఇక్కడే మొదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అవంతి శ్రీనివాస్ గారికి, హరీష్ శంకర్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి థాంక్యూ. ఈ సినిమా నాకు మూడేళ్ల కల. నా మీద నమ్మకంతో వరుణ్ తేజ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు నాకు అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో తమ్ముడు సినిమా ఎలాంటి మైల్ స్టోన్ గా నిలిచిందో.. వరుణ్ తేజ్ గారికి గని సినిమా అలా మైల్ స్టోన్ అవుతుంది. ఇక మా నిర్మాతలు ఇద్దరు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అల్లు బాబి, సిద్దు గారికి దానికి థాంక్యూ. ప్రతి నిమిషం నాతో పాటు వాళ్ళు కూడా మూడు సంవత్సరాలు కృషి చేశారు. మధ్యలో కరోనా వచ్చిన కూడా వెనకడుగు వేయలేదు. అన్ని విషయాలు మాకు ముందుండి మా గురువు అల్లు అరవింద్ గారు అన్ని చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ నన్ను, బాబి, సిద్ధుని ముందుకు నడిపించారు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా తీస్తే రికార్డులో ఉంటుంది.. హిట్టయితే చరిత్రలో ఉంటుంది.. ఖచ్చితంగా గని సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో మీరే అది చూస్తారు’ అని తెలిపారు.

చిత్ర నిర్మాత సిద్దు ముద్ద గారు మాట్లాడుతూ..’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా కోసం వచ్చిన అల్లు అర్జున్ గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాలి. అందులో మొదటి వాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. నీతో సినిమా చేస్తానని చెప్పడం వేరు.. ఒప్పుకున్న తర్వాత ప్రతిది దగ్గరుండి చూసుకోవడం వేరు. గని సినిమా విషయంలో వరుణ్ తేజ్ ఇదే చేశాడు. అన్ని దగ్గరుండి నేర్పించాడు. ఇక రెండో వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకున్నారు. సినిమా ఎలా జరుగుతుంది అని అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అలాగే నా వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎంతో దృష్టి పెట్టారు. ఇక మూడో వ్యక్తి అల్లు అరవింద్ గారు. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. మేము గని సినిమాను జాగ్రత్తగా నిర్మించాం. ఏప్రిల్ 8 తర్వాత ఆ విషయం మీకే తెలుస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులు అందరికి నచ్చుతుంది..’ అని తెలిపారు.

నిర్మాత అల్లు బాబీ గారు మాట్లాడుతూ.. ‘ మేము కొత్త వాళ్ళము అయినా కానీ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను నిర్మించాము. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడడానికి అంటే ఎప్పటికీ 8 న విడుదలైన తర్వాత మాట్లాడటం మంచిది అనుకుంటున్నాను..’ అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ..’ గని సినిమా మూడేళ్ల కష్టం. కరోనా కారణంగా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టారు. ఇక హీరో వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. తాను ఎదగడంతో పాటు తన పక్కన ఉన్న స్నేహితులు కూడా ఎదగడానికి ఉపయోగపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి వరుణ్ తేజ్. ఈ సినిమా అనుకున్నట్టు పూర్తవడానికి ముఖ్యకారణం వరుణ్ తేజ్. అతడితో నేను కచ్చితంగా కేజిఎఫ్ లాంటి ఒక భారీ సినిమా చేస్తా. నిర్మాతలు అల్లు బాబి, సిద్ధూ ముద్ద ఇద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి తెలుసు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు. బాక్సింగ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడటానికి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి.. వస్తారు అని నమ్మకం కూడా ఉంది. ఈ టీమ్ అంతా కలిసి చేసిన ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పాలి. సాధారణంగా కొడుకులను, కుటుంబ సభ్యులను నేను పెద్దగా పొగడను.. కానీ ఈ రోజు అతడి స్థాయి ఏంటి అనేది అందరికీ తెలుసు. అల్లు పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసిన అల్లు అర్జున్ కు సభాముఖంగా అభినందిస్తున్నాను’ అని తెలిపారు.

హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ముఖ్య అతిథులందరికీ థాంక్స్. గని సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు గని వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రేపు విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్ ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..’ అని తెలిపారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా ఫ్యామిలీలో నాన్నగారు అల్లు అరవింద్ తర్వాత తమ్ముడు శిరీష్ నిర్మాత అవుతాడు అనుకున్న.. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు మా అన్నయ్య అల్లు బాబి అధికారికంగా నిర్మాతగా మారి మొదటి సినిమా చేశాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బాబికి మొదటి సినిమా అయి ఉండొచ్చు కానీ నా ప్రతి సినిమా విషయంలో బాబి జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది. తను ఒక కథ ఎంపిక చేసుకొని సినిమా చేసాడు అంటే ఖచ్చితంగా అది హిట్. సిద్దు ముద్దకు మా కజిన్ సిస్టర్ ని ఇచ్చాము. ఎక్కడో యూఎస్ లో జాబ్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడి.. ఇండస్ట్రీకి వచ్చిన ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. నా బ్రదర్ వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. అతడు అంటే నాకు చాలా ఇష్టం. కేవలం కుటుంబ సభ్యుడిగా నే కాకుండా నటుడిగా ఆయన ఎంచుకునే కథలు చాలా ఇష్టం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి కథలో ఒక నావెల్టీ ఉంటుంది. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం అందరు హీరోలకు సాధ్యం కాదు. గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి గురించి చెప్పాలి. నేను సినిమా చూశాను.. చాలా బాగుంది అది ఎంత బాగుంది అనేది మీరు చెప్పాలి. అందుకే దర్శకుడు కిరణ్ కు అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను..’ అని తెలిపారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES