ఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైన ‘ఎదురు చూపు’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన..

473

శ్రీమతి జంగమ్మ సమర్పణలో SRL క్రియేషన్స్ బ్యానర్‌పై మణికంఠ వారణాసి, మహేశ్వరి వడ్డి జంటగా డిఎల్‌వి బన్నీ తెరకెక్కిస్తున్న సినిమా ఎదురు చూపు. ఉగాది సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ హీరో ఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ సినిమాను దుబ్బాక జగదీశ్వర్, నరేష్ గౌడ్ శనిగల, కనుగుల నరేష్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో ఆకాశ్ పూరీ మాట్లాడుతూ.. ‘ సినిమా గ్లింప్స్ చూసాను.. చాలా రీ ఫ్రెషింగ్‌గా ఉంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా బాగా చేసారు. దర్శకుడు బన్నీ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఎదురుచూపు కచ్చితంగా ఆడియన్స్ అభిమానం అందుకుంటుంది..’ అని తెలిపారు.

చిత్రయూనిట్ స్పందిస్తూ.. ‘ఆకాశ్ పూరీ గారికి థ్యాంక్స్. మా సినిమా గ్లింప్స్ విడుదల చేసినందుకు ధన్యావాదాలు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాం. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం..’ అని తెలిపారు.

నటీనటులు:
మణికంఠ వారణాసి, మహేశ్వరి వడ్డి తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: DLV బన్నీ
నిర్మాత: దుబ్బాక జగదీశ్వర్
సహ నిర్మాతలు: నరేష్ గౌడ్ శనిగల, కనుగుల నరేష్
DOP: అమీర్
సంగీత దర్శకుడు: కార్తీక్ B కొడకండ్ల
ఎడిటర్: KCB హరి
PRO: లక్ష్మీ నివాస్