వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నాయిక‌గా హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌

1020


ఇటీవ‌ల ‘క్రాక్’‌, ‘నాంది‘ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అమితంగా ఆక‌ట్టుకున్న విల‌క్ష‌ణ తార వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నాయిక‌గా హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కాంచ‌న కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కోనేరు స‌త్యనారాయ‌ణ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి ద‌ర్శ‌కుడు.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్‌ర్‌ను రిలీజ్ చేశారు.

హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందే ఈ సినిమాలో వర‌ల‌క్ష్మి ఓ విల‌క్ష‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ముర‌ళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ చిత్రానికి గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: డార్లింగ్ స్వామి
స‌మ‌ర్ప‌ణ‌: కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌
నిర్మాత‌: కాంచ‌న కోనేరు
బ్యాన‌ర్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385