‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకొని ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్ 2’ లాంటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ..
మీరు ఎక్కువ క్లాసీరోల్స్లోనే నటించారు కదా! ఇప్పుడు పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది?
– ప్లేబోయ్ జోనర్లో చాలా సినిమాలు చేశాను. అయితే ఇప్పుడు ఈ మాస్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. మనం ఏ మాస్ క్యారెక్టర్ చేసిన ఆ క్యారెక్టరైజేషన్ తాలూకు రీజన్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే దానికి పూర్తి న్యాయం చేయగలుగుతాం. ఈ సినిమాలో గద్దలకొండగణేష్ క్యారెక్టర్ ఎందుకంత భయంకరంగా ఉంటుందో అన్నదానికి కరెక్ట్ రీజన్ చూపించారు హరీష్ శంకర్. అందుకే ఈ క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను.
ప్రమోషన్స్‌లో కూడా అదే గెటప్‌లో కనిపిస్తున్నారు?
– దీన్ని మించిన కంఫర్ట్ దేనిలో ఉండదు. నేను ఇంట్లో కూడా ఇలానే ఉంటాను.
తమిళ మాతృకలో ఎంతవరకూ మార్పులు చేశారు?
-జిగర్తాండ ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్. ఆ ఫీల్ పోకుండా మన నేటివిటీకి తగ్గట్లు ఫిఫ్టీ పర్సెంట్ చేంజెస్ చేశాం. గద్దల కొండ గణేష్ క్యారెక్టర్ ఎందుకంత భయంకరంగా ఉంటుందో అన్నదానికి ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి నిడివి కొంచెం ఎక్కువ చేశాం. మిగతా క్యారెక్టర్స్ అలానే కొన్ని సీన్లు అలాగే తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్యారెక్టర్ చేస్తున్నాఅనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి?
– మా ఫ్యామిలిలో చాలా మంది జిగర్తాండ సినిమా చూడలేదు. నా స్నేహితులు చాలా మంది కరెక్ట్ కాదేమో ఆలోచించుకో అన్నారు.. నేను చిరంజీవి గారికి ఫోన్ చేసి డాడీ కథ ఇలా అనుకుంటున్నాను అన్నాను. తరువాత హరీష్ నేను వెళ్లి కలిసాం. కథ చాలా బాగుంది నువ్వు తప్పకుండా చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు. హరీష్ గారు కూడా వాటిని అప్లై చేశారు.
హరీష్ శంకర్ మేకింగ్ గురించి?
– నేను ఈ క్యారెక్టర్‌ను ఇంతబాగా చేయడానికి హరీష్ గారు 100 హెల్ప్ చేశారు. ఎఫ్2 లో తెలంగాణ కొంచెం నీట్‌గా ఉంటుంది కానీ ఈ సినిమాకు వచ్చే టప్పడికి తెలంగాణ యాస కొంచెం కొట్టినట్లు ఉంటుంది. ఆయన డైలాగ్స్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ సినిమా ఇంతబాగా రావడానికి మేజర్ కారణం ఆయనే.
ఈ క్యారెక్టర్ తమిళ్లో బాబీ సింహ చేశారు కదా? మీ మీద ఆయన ఇన్ఫ్లూయన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా?
-బాబీ సింహ మన తెలుగువారే. ఆయనది విజయవాడ. ఆ క్యారెక్టర్‌కి ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేను ఆయన క్యారెక్టర్ ను ఇమిటేట్ చేయడానికి చూడలేదు. నా ఓన్‌గా ఆ క్యారెక్టర్‌ను రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను.
హరీష్ వర్క్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటారు కదా! మీరు ఎలా బాలన్స్ చేయగలిగారు?
– ఇలా మాట్లాడుతున్నపుడు మెల్లగా ఉంటాను కానీ వర్క్ విషయంలో నేను కూడా చాలా ఫాస్ట్.
‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రజర్ ఫీల్ అయ్యారా?
– జనరల్‌గా నాకు సాంగ్ అంటే ఒక ప్రజర్ ఉంటుంది. ఆ ప్రాజెర్ ఫీల్ అయ్యాను అంతే… ఎందుకంటే మొదటగా హరీష్ గారు ఈ సాంగ్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ సాంగ్ హిస్టరీ గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. మిగతా విభాగాలుఅన్నీ వారి పని వారు కరెక్ట్‌గా చేశారు. నేను డాన్స్ వేశాను అంతే..కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ సాంగ్ వేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
– 14 రీల్స్ ప్లస్ బేనర్ మీ సినిమాతో స్టార్ట్ అయింది కదా ఎలా అనిపిస్తోంది?
– రామ్ ఆచంట, గోపి ఆచంట గారి బేనర్లో నేను ఫస్ట్ మూవి చేయడం చాలా హ్యాపీ. వారికి సినిమాలంటే చాలా ఫ్యాషన్. కేవలం డబ్బులు పెట్టడం కాకుండా టెక్నికల్‌గా కూడా చాలా సపోర్ట్ చేశారు.
ఈ ఓల్డ్ లుక్ కి ఏమైనా రెఫరెన్సు తీసుకున్నారా?
– పునాదిరాళ్లు, వేట సినిమాలలో చిరంజీవి గారి క్యారెక్టర్ని రిఫరెన్స్‌గా తీసుకున్నా.
అధర్వ మురళి క్యారెక్టర్ గురించి?
– అధర్వ ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ క్యారెక్టర్లో బాగా నటించాడు. తనకు తెలుగు రాకపోయినా డైలాగ్స్ నేర్చుకొని మరి చెప్పాడు.
ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ?
– ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చిన్న క్యారెక్టర్ చేశారు. అలాగే బ్రహ్మాజీ గారి పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. సత్య ఫ్రెండ్ క్యారెక్టర్లో బాగా చేశాడు. మరో క్యారెక్టర్ ఛాయ్ బిస్కెట్లో చేసే అరుణ్ చేశారు. కాస్టింగ్ విషయంలో అంతా పర్ఫెక్ట్గా కుదిరింది.
చిరంజీవి గారిని సైరా సినిమాలో హిస్టారికల్ రోల్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
– నేను ఆయన ఏం చేసిన చూస్తాను. నా సినిమాల కన్న కూడా ఆయన సినిమాలే ఎక్కువ చూస్తాను.
చిరంజీవి గారి బయోపిక్ తీస్తే మీరు చేస్తారా?
– హరీష్ ఈ మధ్య ఒకసారి అన్నారు చిరంజీవి గారి బయోపిక్ తీస్తాను అని. అయితే ఆ రోల్‌నా కన్నా చరణ్ చేస్తే బాగుంటుంది. ఆయన చేయకపోతే సెకండ్ ఛాయస్ నేనే. తప్పకుండా చేస్తాను.