*ఉత్తర చిత్రం ఫీల్ గుడ్ విలేజ్ స్టొరీతో మెప్పించనుంది – డైరెక్టర్ తిరుపతి.యస్ఆర్*

705

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి.యస్ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి 3న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ తిరుపతి.యస్ఆర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ…

సినిమా చేయడం కంటే వాటిని ప్రేక్షకులకు చేర్చడం ఎక్కవు కష్టంతో కూడుకున్న పని. ఉత్తర సినిమాకి ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగాచాలా అనుభవాలు ఎదుర్కొన్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. చివరికి జనవరి మూడున విడుదల కానుంది మా చిత్రం.

నాకు సపోర్ట్ గా నిలిచిన శ్రీపతి రంగదాస్, రవికుమార్ లకు చాలా థ్యాంక్స్. చిత్రీకరణ సమయంలో వారు నాకు బాగా సపోర్ట్ చేశారు. కథ గాకంటే ఇందులోని ఫీల్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. సహాజమైన తెలంగాణా మాటలు, మనుషులను తెరమీదకు తెచ్చాం. సినిమా చూస్తున్నంత సేపు ఒక విలేజ్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఉత్తర లో మహిళల రక్షణ పై డిస్కస్ చెయ్యడం జరిగింది. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. హీరో శ్రీరామ్, కారుణ్యల సహాకారం ఈసినిమాకు చాలా ఉంది. వారి నటన సినిమాకు హైలెట్ కానుంది.

ఉత్తర షూటింగ్ కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. దైర్యంగా ముందుకు వెళ్ళాం. మేము కథను నమ్మి ఈ సినిమా చేశాం. ఒక నిజాయితితో కూడిన కథను ఆడియన్స్ కు చెప్పబోతున్నాము. నటుడు అభయ్, వేణు మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్వించబోతున్నాయి.

ఉత్తర అంటే ఒక అమ్మాయి, అలాగని హీరోయిన్ పాత్ర పేరు కాదు. అదేంటి అనేది సినిమా చూసి తెలుసుకోండి. ఈ చిత్రం ప్రీమియర్ షో కామన్ ఆడియన్స్ కు వెయ్యడం జరిగింది. చూసిన అందరూ బాగుంది అన్నారు. రేపు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను.