మంగ్లి,సింగర్ రోల్ రైడా పాడిన ‘రాం రాం’ పాట “ఊల్లాల ఊల్లాల” చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది – నిర్మాత ఏ . గురురాజ్

595


సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమౌతున్నారు. నూరిన్‌, అంకిత‌ కథానాయికలు.తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల ఊల్లాల” చిత్రం లో ‘రాం రాం’ పాట పాడుతూ నటించడమే కాక, హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది.’రాం రాం’ అనే ఈ పాటను ప్రముఖ కమెడియన్ రఘు బాబు , పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఆలపించడం విశేషం . ఈ పాట పూర్తి వీడియోను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా హైదరాబాద్ లో రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా సింగర్ మంగ్లి మాట్లాడుతూ, “నిర్మాత గురురాజ్ అన్న తన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎన్ని కష్టాలు , నష్టాలు పడ్డా చిత్ర పరిశ్రమకి దూరమవ్వకుండా మంచి మంచి చిత్రాలని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆయన చాలా ఇష్టంతో నిర్మించారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ “మా చిత్రం జనవరి 1న విడుదల అవుతుంది. కాసర్ల శ్యామ్ మా ప్రతి చిత్రంలో ఒక్క పాట అయినా కచ్చితంగా రాసి తీరుతారు. గమ్మత్తుగా అయన పాడిన పాటే చిత్రానికి హైలైట్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన రాసిన ఇస్మార్ట్ శంకర్ , అలవైకుంఠపురంలో పాటలు ఎలా హిట్ అయ్యాయో, మా ‘రామ్ రామ్’ పాట కూడా అలానే మంచి విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను.
దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ ” నాలా అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నా, నాకు మాత్రం గురురాజ్ అనే వ్యక్తి ”సత్య ప్రకాష్ నువ్వు డైరెక్షన్ చెయ్యి” అని అంటూ, నాకేం తెలుసో తెలియదో కూడా అడక్కుండా నన్ను నమ్మి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. మా నిర్మాత గురురాజ్ గారే ఈ చిత్రం అవ్వడానికి కర్త కర్మ క్రియ. ఆయనతో పాటు రామకృష్ణ గౌడ్ గారు కూడా అండగా నిలబడ్డారు. వీరిద్దరి సహకారంతోనే అనుకున్నది సాధ్యమైంది. డిసెంబరు 1 న చిత్రం విడుదలవుతుంది. మంచి చిత్రం తీశామని నమ్మకం మాలో ఉంది ” అని అన్నారు.