” తుగ్లక్” శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న

542

గీతా టాకీస్ బ్యానర్ పై రోహన్ సిద్ధార్థ్, చైతన్య ప్రియ హీరో హీరోయిన్లుగా ప్రణీత్ పండగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్. సస్పెన్స్, కామెడీ ప్రధాన అంశాలుగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పెద్దపట్నంలంక, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. బ్రహ్మానందం, సుమన్ శెట్టి, జబర్దస్త్ శంకర్ ఈ మూవీలో నటిస్తున్నారు.

తుగ్లక్ చిత్రంలోని ఒక పాటను కాశ్మీర్ లో చిత్రీకరణ జరిపారు, మిగిలిన నాలుగు పాటలు త్వరలో పూర్తి చేయనున్నారు. వైజాగ్ లో కొన్ని కీలక సీన్స్ షూట్ చేయనున్న ఈ చిత్రానికి కిషోర్ కెమెరామెన్ గా పని చేయనున్నారు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రణీత్ పండగ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

నటీనటులు:
నటీనటులు :రోహన్ సిద్ధార్, చైతన్య,సుమన్ శెట్టి, శేషు, సురేందర్ రెడ్డి, రాఘవేంద్ర, కోటేశ్వరరావు, శాంతకుమార్, రామణి

సాంకేతిక నిపుణులు:

సమర్పణ :గీతా టాకీస్
ప్రొడ్యూసర్ : పరమగీత
మ్యూజిక్, : మహేష్ ధీర
కెమెరా : కిషోర్
రచన &దర్శకత్వం : ప్రణీత్ పండగ