HomeTeluguమణికొండా లో ‘అలంకార్ స్టూడియో అండ్ అకాడెమీ’..

మణికొండా లో ‘అలంకార్ స్టూడియో అండ్ అకాడెమీ’..


ఈ అలంకార్ స్టూడియో ని ఓంకార్ స్వామిజీ మరియు సినీనటులు సిద్దిఇద్నాని, ఆశిమా, బిగ్ బాస్ ఫేమ్ హిమాజ, సీరియల్ నటి కరుణా మరి కొంతమంది సెలెబ్రెటీలు కలిసి ప్రారంభించారు

మేకప్ .. ఇది లేని క్రియేటివ్ ఫీల్డ్ ను ఊహించలేం. ఎమోషన్ ను ఎలివేట్ చేస్తూ కల్చర్ ను రిప్రెజెంట్ చేసేదే అలంకరణ. అందుకే ఈ రంగంలో రోజు రోజుకూ అనేక మార్పులు వస్తున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా నిపుణులు కూడా ఉండాలి. ఇప్పటి వరకూ మన వద్ద అంతర్జాతీయ స్థాయి అలంకరణ నిపుణులు అతి తక్కువ గా ఉన్నారనే చెప్పాలి. ఆ లోటును తీరుస్తూ మన హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా వెస్ట్రనైజ్డ్ తో పాటు ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబిస్తూ ‘అలంకార్’పేరుతో ఓ సరికొత్త మేకప్ స్టూడియో అండ్ అకాడెమీ మొదలైంది. అలంకరణ రంగంలోని అన్ని అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో తీర్చి దిద్దిన ఈ ‘అలంకార్’ లో అన్ని అద్భుతమైన అధునాతనమైన సదుపాయాలు ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి అలంకరణలతో కూడిన మేకప్ స్టూడియో ఇండియాలోనే ఇది మొదటిది.
ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బ్రైడల్ ఎక్స్ పర్టెన్సీ, మేకోవర్ ట్రాన్సర్ఫేషన్ కు పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మొదలైన ఈ అలంకార్ స్టూడియో.. ఇప్పటి వరకూ తెలుగు సినిమా, టివి రంగంలో ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులకు అలంకరణ చేసిన ఇంటర్నేషనల్ మేకప్ ఎక్స్ పర్ట్ అశోక్ రాయల ఆధ్వర్యంలో మొదలైంది. అత్యంత ఉన్నత విద్యావంతుడైన అశోక్ రాయలగారు.. తనకున్న ప్యాషన్ కొద్దీ ఈ మేకప్ రంగంలో ప్రవేశించి నిష్ణాతుడుగా పేరు తెచ్చుకున్నారు. తన సారథ్యంలో అనేకమంది మేకప్ ఆర్టిస్టులను ట్రెయిన్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఉద్దేశ్యంతో ఇండియాలో ఇప్పటి వరకూ రాని, లేని మేకప్ టెక్నిక్స్ ను పరిచయం చేస్తూ.. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిచ్చేలా తన అలంకార్ స్టూడియోను తీర్చిదిద్దారు.

ఈ ఆదివారం ఎంతోమంది సినీ, టివి సెలబ్రిటీస్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా.. కొందరు అనాథ పిల్లలతో అశోక్ గారు ఈ ‘అలంకార్’స్టూడియోను ప్రారంభించడం విశేషం. ఇకపై హైదరాబాద్ లోనే అంతర్జాతీయ స్థాయిలో మేకప్ అవసరాలన్నీ అలంకార్ లోనే పూర్తి చేసుకోవచ్చు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES