దేశ్ కి నేత కేసీఆర్ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

207

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ రూపొందించిన ”దేశ్ కీ నేత కేసీఆర్” అనే పాటను తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడులకను పురస్కరించుకుని ఈ పాటను రూపొందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసం లో ఈ పాటను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ జన్మదిన సందర్బంగా పాటను రూపొందించడం ఒక ఆనవాటితిగా పెట్టుకున్నాడు. కారణజన్ముడు కేసీఆర్, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అభివృద్ధి అవుతోంది. తెలంగాణ లో అన్ని పరిశ్రమల మాదిరిగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అద్భుతంగా అభివృద్ధి సాధిస్తోంది. కేవలం సినిమా వాళ్ళకే కాదు సినిమా కార్మికులకు కూడా అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్. నిత్యం సినిమా కార్మికుల మధ్య ఉంటూ సినీ పరిశ్రమ బాగుకోసం ఆలోచించే ప్రతాని రామకృష్ణ గౌడ్ , దర్శకుడు సముద్ర మరోసారి కేసీఆర్ మీద పాత రూపొందించినందుకు అభినందిస్తున్నాను. పాటలో ఏదైతే రాశారో అది అక్షరాలా నిజమవుతుంది. దేశానికి ఒక నాయకుడు కావాలె. దేశాన్ని ముందుకు నడిపించే నాయకుడే కేసీఆర్ . దేశాన్ని అమ్ముకుంటూ, సర్వనాశనం చేస్తూ, ఉద్యోగాలు లేకుండా, కేవలం అధికార దాహంతో ఉన్న కేంద్రానికి బుద్ధి చెప్పడానికే కేసీఆర్ ముందడుగు వేశారు. అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.