ఆకట్టుకుంటున్న “పిండం” థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ *తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన యువ హీరో శ్రీ విష్ణు *కళాహి మీడియా తొలి చిత్రం ‘పిండం‘ *”ది స్కేరియస్ట్ ఫిల్మ్” అనేది ఉప శీర్షిక

127

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న ‘పిండం‘ చిత్రాన్ని తొలిసారి దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్న సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈరోజు చిత్రానికి సంభందించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించి విజయాన్ని ఆశిస్తూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతోందని చిత్ర దర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతూ, ఇంతటి భయానక హార్రర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని అభిప్రాయ పడ్డారు. “ది స్కేరియస్ట్ ఫిల్మ్” అనే ది ఉప శీర్షిక. ఇది విడుదల అయిన ప్రచార చిత్రాన్ని గమనిస్తే నిజమని పిస్తుంది. దీపపు లాంతర్లు వెలుగులో చిత్ర కథానాయకుడు శ్రీరామ్, నాయిక ఖుషి రవి,ఈశ్వరీ రావు తదితరులు ఓ బల్లపై పడుకున్న పాప చుట్టూ ఉండటం, ఓ వ్యక్తి చేతిలో పుస్తకం, వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా ఏదో ప్రమాదం గురించి కనిపిస్తున్న ఆందోళన, ఇవన్నీ భయానికి గురి చేస్తున్నాయి. ఇది జానర్‌కు అనుగుణంగా స్ట్రెయిట్ హార్రర్ ఫిల్మ్ అవుతుంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో…మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనుంది అన్నారు. హార్రర్ కథావస్తువు దర్శకుడిగా నా తొలి చిత్రానికి ఎంచుకోవటం వెనుక కారణం ఛాలెంజింగ్ గా ఉంటుందని.

పిండం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 30న విడుదల చేయనున్నారు. నవంబర్ నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు.

శ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ ‘పిండం‘ చిత్రంలో ఆయన సరసన ఖుషి రవి నాయికగా కనిపించనున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డి ఓ పి: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
పోరాటాలు: జష్వ
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ : ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి