ది రోజ్ విల్లా” ట్రైలర్ బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ సోహైల్ !!

1369


కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ ‘దియా’ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం “ది రోజ్ విల్లా”. శ్వేతా వర్మ హీరోయిన్ గా చిత్ర మందిర్ స్టూడియోస్ పతాకంపై హేమంత్ దర్శకత్వంలో అచ్యుత్ రామారావు పి. ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజరవీంద్ర, అర్చన కుమార్, వెన్నెల రామారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం జనవరి 4న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.

ప్రముఖ నటుడు రాజరవీంద్ర మాట్లాడుతూ.. ‘హీరో దీక్షిత్ వెరీ ఫ్యాషనేట్ యాక్టర్. చాలా అద్భుతంగా నటించాడు. అలాగే డాన్సర్, థియేటర్ ఆర్టిస్ట్ అయిన అర్చన కుమార్ చాలా బాగా యాక్ట్ చేసింది. బేసిగ్గా ఆవిడ కన్నడ అయినా కూడా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పారు. ఇక కెమెరామెన్ అంజి సూపర్బ్ విజువల్స్ తో ఎక్స్ట్రార్డినరీ గా వర్క్ చేసాడు. సురేష్ బొబ్బిలి ఔట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నిర్మాత రామారావు చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద సినిమా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. హేమంత్ ఫస్ట్ సినిమా అయినా చాలా క్లారిటీగా కాన్ఫిడెంట్ తో “దిరోజ్ విల్లా” చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన రామారావుకు, దర్శకుడు హేమంత్ కి నా థాంక్స్.. అన్నారు.

చిత్ర దర్శకుడు హేమంత్ మాట్లాడూ.. ‘ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని.. సినిమా ఎలావుందీ అనేది ప్రేక్షకులు చూసి చెప్పాలి. రాజారవీంద్ర ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే హీరో దీక్షిత్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ కథకి ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. నటీనటులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ కెమెరామెన్ అంజి. చాలా గ్రాండియర్ గా విజువల్స్ ఇచ్చారు. అలాగే సురేష్ రీ-రికార్డింగ్ చాలా ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. ఒక సెంటిమెంట్ సాంగ్ అద్భుతంగా చేశాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామారావు, పద్మనాభరెడ్డి గారికి థాంక్స్.. అన్నారు.

ముఖ్య అతిధి సోహైల్ మాట్లాడుతూ.. ‘ ఈ బ్యానర్ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. బిగ్ బాస్ కి ముందు నేను చాలా కష్టాల్లో వున్నప్పుడు రామారావు అన్న నాకు చాలా హెల్ప్ చేసి నాకు బాలీవుడ్ వెబ్ సిరీస్ చేసే అవకాశం ఇచ్చారు. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. యుయస్ లో ఉండి జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోకుండా సినిమా మీద ప్యాషన్ తో వరుసగా ఇక్కడ సినిమాలు స్టార్ట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే బుజ్ బమ్స్ వచ్చాయి.. . అన్నారు.

నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. ‘ చిత్ర మందిర్ స్టూడియోస్ పెట్టి సక్సెస్ చేశాం. ఇప్పుడు అదే పేరు తో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మూడు సినిమాలు బాక్ టు బాక్ చేస్తున్నాం. ముందుగా “ది రోజ్ విల్లా” చిత్రం మా బ్యానర్ నుండి వస్తుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతిఒక్కరూ అభిమానంతో ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశారు. వారందరికీ నా థాంక్స్. ఇందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. దీక్షిత్ కమిటెడ్ గా పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. అలాగే రాజరవీంద్ర, అర్చనకుమార్, శ్వేతా వర్మ బ్యూటిఫుల్ గా నటించారు. కెమెరామెన్ అంజి, శ్రీ విష్ణు, దీక్షిత్ లతో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ..’ కన్నడలో చేసిన “దియా” చిత్రాన్ని భాషా భేదం లేకుండా ఆదరించి సక్సెస్ చేశారు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రామారావు కి థాంక్స్. ఒక ప్యాషన్ తో ఎంతో హార్డ్ వర్క్ చేసి హేమంత్ ఈ సినిమా చేశాడు. స్టోరీ అద్భుతంగా నేరేట్ చేసాడు. షూటింగ్ బిగినింగ్ నుండీ సెట్లో ఎలా యాక్ట్ చేయాలో చెప్పి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. కెమెరామెన్ అంజి చాలా ఫాస్ట్ గా క్లారిటీగా ఫినిష్ చేశారు. రాజరవీంద్ర సెట్లో చాలా టిప్స్ ఇచ్చారు. శ్వేతా వర్మ, అర్చన కుమార్ వండర్ ఫుల్ గా నటించారు. అన్నారు.

దీ,క్షిత్ శెట్టి శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజరవీంద్ర, అర్చనకుమార్, వెన్నెల రామారావు, టి.యన్.ఆర్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; గరుడవేగ అంజి, మ్యూజిక్; సురేష్ బొబ్బిలి, ఎడిటర్; శివ, స్టైలింగ్; శ్రీదేవి కొల్లి, సందీప్ శర్మ, పి.ఆర్.ఓ; వంశీ శేఖర్, యూనిట్; యు అండ్ ఐ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత; అచ్యుత్ రామారావు.పి, రచన-దర్శకత్వం; హేమంత్.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385