దీపావళి కానుకగా ‘నిరీక్షణ’ ఫస్ట్‌లుక్‌, ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’ విడుదల

500


సాయిరోనక్‌, ఎనా సహా జంటగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో పి.రాజన్‌ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’నిరీక్షణ’. ఈ చిత్రంలో మొదటిసారి ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించగా రోల్‌ రిడా గానం చేశారు.
సాయి రోనక్‌, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.