లాక్ డౌన్ బిఫోర్ షూటింగ్ జరుపుకొని అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రం ది గోస్ట్ రిసార్ట్. శుభోదయా ప్రొడక్షన్స్ టి.లక్ష్మీ సౌజన్య గోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నా ఈ చిత్రంలో అభినవ్ సర్దార్ పటేల్ హీరోగా నటిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడారు.
అభినవ్ సర్దార్ పటేల్ మాట్లాడుతూ… ఈ స్పెషల్ డేని ఇంత స్పెషల్‌గా చేసినందుకు ముందుగా నా టీమ్ అందరికీ నా క్రుతజ్జతలు. నేను ఎటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినా అది కేవలం నా ఒక్కడి వల్ల మాత్రమే కాదు. నాతో పాటు నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా టీమ్ అండదండలు ఉండబట్టి నేను ఎలాంటి సేవా కార్యక్రమాలనైనా చేయగలుగుతున్నాను. నాకు సహాయం చేయడానికి నా వెనుక ఇంత మంది ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మనకంటూ దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఏదో చెయ్యాలనుకుంటే నాకు సహకారంగా నా టీమ్ ఉంటుంది. ఇక మునుముందు నేను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయాలనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తన్నవారందరికీ థ్యాంక్స్. మా టీమ్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అన్నారు.
విజయ్ రాజా మాట్లాడుతూ… ఈ రోజు మన హీరో పుట్టిన రోజు ఆయనకు శుభాకాంక్షలు అన్నారు. ఆయనకి మా టీమ్ అందరి తరపున ఆల్ ద బెస్ట్ టు యువర్ మూవీ అన్నారు.
సన్నీ దర్శకుడు మాట్లాడుతూ… నాకు పరిచయమయిన వ్యక్తుల్లో చాలా మంచి వ్యక్తి సర్దార్. కరోనా సమయంలో చాలా మందికి చాలా విధాలుగా సహాయపడ్డారు. ఫుడ్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ చాలా మంది పేదవారికి ఆయన పంచారు అన్నారు. ఆయనతో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ప్రొడ్యూసర్ గోపాల్ మాట్లాడుతూ… ముందుగా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే ఆయనకి ఆల్ ద బెస్ట్. ఆయన దేశానికి చాలా సేవ చేయాలి. దానికోసం మునుముందు ఇంకా ఆయన చాలా చేయబోతున్నారు అన్నారు.
దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ… సర్దార్ గారితో నాకు పరిచయమయి ఐదేళ్ళయింది. ఆయన ఎప్పుడూ ఎవ్వరితోనూ రిలేషన్ ని పోగొట్టుకోడు. ఎలాంటి వారినైనా సరే తన అక్కున చేర్చుకుంటాడు. చాలా మంచి వారు. మా అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలి అన్నారు. సన్నీ, షానీ, దర్శకుడు రాథోడ్ , నటి నిధి తదితరులు పాల్గొన్నారు.
టెక్నీషియన్స్ లిస్ట్
డైరెక్టర్: సాయిరాజేష్ మరియు టీమ్
ప్రొడ్యూసర్: టి. లక్ష్మీసౌజన్యగోపాల్
కో ప్రొడ్యూసర్: ఆర్. జయంతి సుబ్రమణ్యం
హీరో: అభినవ్ సర్దార్ పటేల్
హీరోయిన్: మధు లగ్న దాస్
డిఒపి: చక్రి
మ్యూజిక్: డిజెఎస్
ఎడిటర్: శివ
పి.ఆర్. ఓ: సాయి సతీష్