HomeTeluguతెలుగులో మొదటి ఇంటరాగేటివ్ సినిమా గా.... ది ట్రయల్

తెలుగులో మొదటి ఇంటరాగేటివ్ సినిమా గా…. ది ట్రయల్


ఎస్ ఎస్ ఫిల్మ్స్ మరియు కామన్ మాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ”ది ట్రయల్”. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ముఖ్య తారాగణంగా రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల సిద్దంగా ఉంది. స్మృతి సాగి మరియు శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మాతలుగా మరియు సుదర్శన్ రెడ్డి సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

రంజాన్ మరియు అక్షయ తృతీయ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తిగా అనిపిస్తూ, సినిమా టైటిల్ కి తగ్గట్టుగా పోస్టర్ లో చూపించిన డీటైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక పోస్టర్ పై సింహభాగం లో ఉన్న స్పందన పల్లి యొక్క మొహంలో ఏదో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. అలాగె పోస్టర్ పైన ఇంటరాగేషన్ రూమ్ లో ఎస్సై గా వ్యవహరిస్తున్న వంశీ కోటు ఎదురుగా స్పందన పల్లి విచారణ ఎదుర్కోవటం మనం గమనించవచ్చు. తద్వారా ఈమె ఏమైనా తప్పు చేసి విచారణ ఎదుర్కుంటుందా? లేదా చేయని తప్పుకు ఇరుక్కుందా? అనేది టీజర్ లో చూడవచ్చెమో. టీజర్ కూడా త్వరలోనే అందిస్తామని ఈ చిత్ర యూనిట్ పోస్టర్ లొ చెప్పకనే చెప్పారు. అదే విధంగా ”ది ట్రయల్” మూవీ తెలుగులో వస్తున్న మొట్టమొదటి ఇంటరాగేటివ్ చిత్రం గా కూడా ప్రచారం జరుగుతుంది.

ఇక నటుల విషయానికి వస్తే, ఈ చిత్రంలో నటించిన స్పందన పల్లి ఇంతకు ముందు పలు చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో నటించిన అనుభవం ఉంది. అదే విధంగా మరొక ముఖ్య పాత్ర అయిన యుగ్ రామ్ గతంలో “కనబడుట లేదు” అనే సినిమా లో ప్రధాన పాత్ర గా చేసి మెప్పించాడు. అందులోనూ ఫస్ట్ లుక్ లో ఈ పాత్ర ను ఉంచకుండా గోప్యంగా ఉంచడం పై ఈ పాత్ర యొక్క ప్రాముఖ్యత కథ పై ఏ విధంగా ఉండొచ్చు అన్న సందేహాలు కూడా పలు చోట్ల వ్యక్తమవుతున్నాయి. ఇక మరొక ముఖ్య పాత్ర అయిన వంశీ కోటు యూట్యూబ్ వేదికగా అందరికీ సుపరిచయం ఉన్న నటుడు. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేస్తూ తనదైన శైలి లో ముందుకు దూసుకుపోతున్నాడు. మరి ఈ చిత్రం లో వంశీ కోటు పోలీస్ పాత్ర లో చాలా డైనమిక్ గా కనిపిస్తున్నాడు.

చివరిగా ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు పోలీస్ అధికారి అని ప్రచారం జరగడం కొస మెరుపు. ఒకవేళ అదే గనుక నిజం అయితే విచారణ సమయం లొ గ్రౌండ్ లెవెల్ లొ జరిగే ప్రతీ డీటైల్స్ ని ఈ సినిమాలో వాడి ఉండొచ్చు అనటంలో అతిశయోక్తి లేదు. ఒక వేళ అదే గనుక నిజం అయితే, నేర విచారణ లో జరిగే నిజమైన కోణాలను దర్శకుడు చాలా బాగా ఆవిష్కరిస్తారు. ఈ సినిమా ఇలాంటి జొనరా లో వచ్చిన సినిమాల్లో చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించాలి అని మనం ఆకాంక్షించాలి.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రామ్ గన్ని
నిర్మాత: స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ.
సహ నిర్మాత: సుదర్శన్ రెడ్డి.
బ్యానర్లు: ఎస్ ఎస్ ఫిల్మ్స్, కామన్ మాన్ ప్రొడక్షన్స్.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సాయి కుమార్ దార.
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
సంగీతం: శరవణ వాసుదేవన్
కో- డైరెక్టర్: శేఖర్ కుంపట్ల.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES