పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి “యూనివర్సిటీ” చిత్రం సెన్సార్ పూర్తి

129

శ్రీ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ; స్నేహ చిత్ర పిక్చర్స్ – “యూనివర్సిటీ” చిత్రం సెన్సార్ పూర్తి అయింది .అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల జేస్తాం. 10వ తరగతిలో పేపరు లీకేజీలు – గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జాఞన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ

నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ”

పాటలు – గద్దర్ – నిస్సార్ – మోటపలుకులు రమేష్ – వేల్పుల నారాయణ.

గాయకులు – గద్దర్ – సాయిచరణ్ – గోస్కుల రమేష్ – పల్లె నరసింహం

నటీనటులు – ఆర్. నారాయణ మూర్తి మరియు నూతన తారాగణం.

ఎడిటింగ్ – మాలిక్
కెమెరా – బాబూరావు దాస్

కథ-స్క్రీన్ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి