ఎమోషనల్ థ్రిల్లర్ ‘‘ది ఛేజ్’’ టీజర్ రిలీజ్

441

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’ అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు.. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘‘ది చేజ్’’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం.అలాగే మోనిక,సత్యం రాజేశ్,హరీష్ ఉత్తమన్,మధునందన్ ఇతరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీ టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లింగ్ గా ఉంది టీజర్. హీరో విజయ్ సేతుపతి,హీరోయిన్ రెజీనా ఈ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది.మంచి డేట్ చూసుకుని తెలుగు,తమిళ భాషల్లో మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్.

నటీనటులు:
రైజా విల్సన్
అనసూయ
మోనిక
సత్యం రాజేష్
హరీష్ ఉత్తమన్
మధునందన్.

టెక్నీషియన్స్:

ప్రాజెక్ట్ డిజైనర్ : కె.సతీష్
పబ్లిసిటీ డిజైనర్ :24 ఎ.ఎమ్
పి.ఆర్.వో: జి.ఎస్ .కె మీడియా
సినిమాటోగ్రాఫర్ : వేల్ రాజ్
యాక్షన్ కొరియోగ్రాఫర్ : దిలీప్ సుబ్బరాయన్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్యామ్ సి.ఎస్
ఎడిటర్ : సాబు జోసెఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స,ప్రభా చింతలపాటి
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన,దర్శకత్వం: కార్తీక్ రాజు  

PRO ; GSK MEDIA