గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ చిత్రాన్ని నిర్మించారు . సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ , నిర్మాత సతీష్ , గోపి ఆచంట, రామ సత్య నారాయణ, ప్రసన్న కుమార్ , దామోదర్ ప్రసాద్, దర్శకుడు నరేంద్రనాథ్, జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ”ఆకాశ వీధుల్లో” పక్కా యూత్ ఫుల్ డ్రామా. కేవలం యువత కోసం తీసిన సినిమా ఇది. యూత్ ఈ సినిమా చూడండి. తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఒక స్లో పాయిజన్. ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే నన్ను నేరుగా విమర్శించండి. ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం వుంది. ఈ సినిమా రిటన్ బై రియాలిటీ. నిజ జీవితం నుండి పుట్టిన కథ. డైరెక్టర్ బై ప్యాషన్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి యంగ్ స్టార్ బ్లడ్ బాయిల్ అవుద్ది. చాలా స్ఫూర్తిని పొందుతారని నమ్ముతున్నా. విమర్శకుల కోసం తీసిన సినిమా కాదిది. ఈ సినిమా తీసింది ప్రేక్షకులు, యూత్ కోసం. ”ఆకాశ వీధుల్లో’ సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున థియేటర్ లోకి వస్తోంది. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని. పవర్ స్టార్ ఫాన్స్ నుండి కూడా మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 14 ఏళ్ల కుర్రాళ్ళ నుండి 40 ఏళ్ల యంగ్ స్టర్స్ వరకూ అలాగే వయసుతో నిమిత్తం లేకుండా మనసులో యవ్వనం వుండే అరవై ఏళ్ళ వ్యక్తులకు కూడ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాని మార్నింగ్ షో చూడండి. నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా మీకు ఫ్రండ్ గా మారుతారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి మంచి హిట్ ఇవ్వాలి” అని కోరారు.