తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ క‌మిటీ స‌భ్యుల ఏక‌గ్రీవ ఎన్నిక‌!!

304

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికుల‌తో, 800 ప్రొడ్యూస‌ర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. రెండేళ్ల‌కోసారి జ‌రిగే టియ‌ఫ్ సిసి ఎల‌క్ష‌న్స్ క‌రోనా కార‌ణంగా ఈ సారి కొంత డిలే అయింది. ముందుగా ఎల‌క్ష‌న్స్ జ‌ర‌పాల‌ని నిర్ణయించిన‌ప్ప‌టికీ క‌మిటీ స‌భ్యులంద‌రి ఏకాభిప్రాయంతో క‌మిటీ స‌భ్యుల ఎంపిక ఏక‌గ్రీవంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఎఫ్ఎన్‌సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిటీ స‌భ్యుల పేర్ల‌ను ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్, న్యాయ‌వాది కేవియ‌ల్ న‌ర‌సింహారావు ప్ర‌క‌టించారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ చైర్మెన్ గా డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ వైస్ ఛైర్మెన్ గా ఎ. గురురాజ్‌, డి. కోటేశ్వ‌ర‌రావు, నెహ్రు.జీ, సెక్ర‌ట‌రీ గా సాయి వెంక‌ట్‌, జె. వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నికయ్యారు. తెలంగాణ ఫిలిం ఆర్టిస్ట్స్ అసోషియ‌న్ ప్రెసిడెంట్ గా ఏం.ఎస్‌. ఏసియా ర‌ష్మీ ఠాకూర్, వైస్ ప్రెసిడెంట్ గా ఎ. కిర‌ణ్ కుమార్, కె. అలేఖ్య ఏంజిల్, జ్యోతి రెడ్డి, సెక్ర‌ట‌రీ గా స్నిగ్ధ మధువని, సౌమ్య‌ జాను ఎన్నికయ్యారు. తెలంగాణ డైరెక్టర్స్ అసోషియ‌న్ ప్రెసిడెంట్ గా డా. టి. ర‌మేష్ నాయుడు , వైస్ ప్రెసిడెంట్‌ గా ఎస్. వంశీ గౌడ్, సెక్రటరీ గా ఆర్‌. శ్రీనివాస రెడ్డి ఎన్నికయ్యారు.

డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్థాపించి ఏడేళ్లు పూర్త‌యింది. రెండేళ్ల‌కోసారి జ‌రిగే ఎన్నిక‌లు ఈ సారి క‌రోనా కార‌ణంగా కొంత లేట‌యింది. క‌మిటీ స‌భ్యుల కోరిక మేర‌కు ఎన్నిక‌లు జ‌ర‌ప‌కుండా స‌భ్యుల ఎంపిక ఏకగ్రీవంగా జ‌రిగింది. త్వ‌ర‌లో గ్రాండ్ గా ప‌లువురు సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖుల న‌డుమ ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌రకు మా చాంబ‌ర్ ద్వారా మెంబ‌ర్స్ కు ఎన్నో మంచి ప‌నులు చేశాం. ఇక మీద‌ట కూడా మ‌రెన్నో మంచి ప‌నులు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇక ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారిని కలిసి ఇళ్ల స్థ‌లాల కోసం విన్న‌వించుకున్నాం. త్వ‌ర‌లో 10 ఎక‌రాల ల్యాండ్ ని కేటాయిస్తామ‌ని వారు మాట కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా మెంబ‌ర్స్ అంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు ఇప్పిస్తాం. మ‌మ్మ‌ల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న టియ‌ఫ్‌సీసీ స‌భ్యులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాం“ అన్నారు.

వైస్ ఛైర్మ‌న్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ…“మ‌రోసారి టీయ‌ఫ్‌సీసీకి వైస్ చైర్మ‌న్ గా ఎన్నిక కావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.
జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ…“ఇప్ప‌టి వ‌ర‌కు టీయ‌ఫ్‌సీసీకి రెండు సార్లు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా చేశాను. మ‌రోమారు ఎంపిక కావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు.