కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ డిసెంబర్ 10న విడుదల

527

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది.

తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర ఓ ప్రకటన చేశారు. ‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామ’ని అన్నారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385