సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా “తీరం” ట్రైలర్ విడుదల!!

301


నూతన యువకథా నాయకులు శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు..

హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. కొత్తవాళ్ళం అని చూడకుండా అడిగిన వెంటనే మంచి మనసుతో మా తీరం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన గొప్ప దర్శకులు వినాయక్ గారికి మా కృతజ్ఞతలు.. ఇక సినిమా ప్రెజెంట్ యూత్ కి తగ్గట్లుగా ట్రెండీగా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది.. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా తీరం చిత్రాన్ని తెరకెక్కించాం. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఉంటూనే అంతర్లీనంగా ఒక చక్కని సందేశం ఈ చిత్రంలో చూపించటం జరిగింది.. కచ్చితంగా ప్రేక్షకులకు తీరం సినిమా నచ్చుతుంది మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం .. అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. ” తీరం సినిమా చాలా బాగా వచ్చింది.. అందరం చాలా నమ్మకంతో ఉన్నాం.. ఈ చిత్రాన్ని అనిల్ సుపెర్బ్ గా చిత్రీకరించారు.. సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి.. శ్రవణ్ కెమెరా విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.. వినాయక్ గారి లాంటి పెద్ద దర్శకులు మా చిన్న సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. మా టీమ్ అందరి తరుపున ఆయనకి మా ధన్యవాదాలు.. ఈ తీరం చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను అభ్యర్ధిస్తున్నాను.. అన్నారు.

సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బోలేమోని మాట్లాడుతూ.. ” తీరం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక అద్భుతమైన ప్రేమకథా చిత్రం. కొత్త కంటెంట్ తో అనిల్ ఇనమడుగు ఈ సినిమాని రూపొందించాడు.. డిఫరెంట్ కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే ఈ తీరం చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అన్ని పనులు పూర్తిస్థాయిలో కంప్లీట్ చేశాం.. ఈ నెల 29న తీరం సినిమాని విడుదల చేస్తున్నాం.. ఏపీ, తెలంగాణాలోనే కాకుండా తమిళ్, కన్నడలో కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు..

శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిస్టెన్ రవళి, అపర్ణ, మై విల్లేజ్ షో అనిల్, శ్రావ్య, రాగి, అజాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రశాంత్ బిజె, కెమెరా; శ్రావణ్ జి.కుమార్, కో-డైరెక్టర్స్; మోహన్ మర్రిపల్లి, రాకేష్ మాధవన్, ప్రభు ఆకాశవాణి, ఎడిటింగ్; శ్రావణ్ జి.కుమార్, సింగర్స్; ఎస్పీ బాలు, ధనుంజయ్, దివ్య ఐశ్వర్య, సాయి చరణ్, ప్రశాంత్ బీజే, పి. ఆర్. ఓ; జిల్లా సురేష్. నిర్మాత; యం. శ్రీనివాసులు, రచన- దర్శకత్వం; అనిల్ ఇనమడుగు.