HomeTeluguఅక్టొబర్ 13 న సినిమా లవర్స్ ని థ్రిల్ చేయనున్న"తంతిరం"

అక్టొబర్ 13 న సినిమా లవర్స్ ని థ్రిల్ చేయనున్న”తంతిరం”

సినిమా బాగుంటే చాలు భారతదేశం లొ సినిమా ప్రేక్షకులు భ్రహ్మరధం పడుతున్నారు. అదే నమ్మకంతో కంటెంట్ ని మాత్రమే నమ్మి క్వాలిటి కి బడ్జెట్ కి ఏమాత్రం రాజీ కాకుండా తీసిన చిత్రం తంతిరం. ఈ చిత్రం నుంచి విడుదలయ్యిన ప్రమెషనల్ కంటెంట్ సాంగ్, టీజర్, పోస్టర్స్ నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంంది. అంతే కాదు ట్రైలర్ కి దాంట్లొ వచ్చిన రీ రికార్డింగ్ కి థ్రిల్ అయ్యారు. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ లాంటి అందమైన జంటని తీసుకుని దర్శకుడు ముత్యాల మెహర్ దీపక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా బండి బ్యానర్ లో శ్రీకాంత్ కంద్రుగుల నిర్మాతగా నిర్మించిన చిత్రం తంతిరం అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అజయ్ అరసడ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా సినిమా ప్రేక్షకుడు కొరుకునే వైవిధ్యమైన కథ. దర్శకుడు మెహర్ తను అనుకున్నది అనుకున్నట్టు తీసిన చిత్రం.. రీరికార్డింగ్ లొ ఎంతో జాగ్రత్తలు తీసకున్నాము. అంతేకాదు ప్రతి చిన్న మ్యూజిక్ కూడా కథలో విలీనమై వుంటుంది. నిర్మాత శ్రీకాంత్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాతో తను అకున్నదాని కంటే బెటర్ అవుట్ పుట్ ని తీసుకువచ్చారు. అక్టొబర్ 13న ఈ చి్త్రం అందరిని థ్రల్ చేస్తుంది. అని అన్నారు

చిత్ర రచయితలు షాభాజ్, వినీత్ లు మాట్లాడుతూ.. ఈ సినిమా ని సౌత్ లో వున్న అన్ని బాషలకి అనగుణం గా కథనాన్నిమాటల్ని రాయటం జరిగింది. ఇలాంటి ప్రయోగం బహుశా ఇదే మెదటిసారి అనుకుంటున్నాం. అక్టోబర్ 13న ఈ చిత్రం చూడటానికి ధియేటర్ కి రండి చాలు థ్రిల్ అవ్వటం మాత్రం పక్కా అని అన్నారు.

దర్శకుడు.. ముత్యాల మెహర్ దీపక్ మాట్లాడుతూ.. నా మోదటి చిత్రానికి ఇంత మంచి టెక్నిషియన్స్ అందించిన నిర్మాత శ్రీకాంత్ కి నా ధన్యవాదాలు.. నా సినిమాటోగ్రఫి వంశి నాకు చిరకాల మిత్రుడు అతని టాలెంట్ రేపు 13 న ధియేటర్స్ చూస్తారు.. తరువాత చాలా పెద్ద చిత్రాలు చేస్తాడు. ట్రైలర్ చూసిని ప్రతిఒక్కరూ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. తంతిరం చిత్రం లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రియాంక శర్మ, హీరో శ్రీకాంత్ సినిమాలోకి తీసుకెళ్ళిపోతారు. అంతబాగా వారిద్దరి జంట కుదిరింది. అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తీయటానికి మా నిర్మాత, దర్శకుడు ఎంత కష్టపడ్డాడో చూసాం.. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి దానికి మించి కష్ట పడుతున్నారు. మొదట మాచిత్రాన్ని సెప్టెంబర్ 22 అనుకున్నాం, తరువాత అక్టోబర్ 6 అనుకున్నాం.. కాని ఇప్పడు అక్డోబర్ 13 న ఖచ్చితంగా వస్తున్నాం. ఎప్పుడు వచ్చినా తంతిరం చాలా మంచి చిత్రం అందరికి ధియోటర్ ఎక్సిపీయరెన్స్ ఇస్తుంది అని అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ కంద్రగుల మాట్లాడుతూ.. ఒక మంచి చిత్రాన్ని బయటకి తీసుకురావాటానికి ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడ్దాం. ఫైనల్ గా నేషనల్ సినిమా డే రోజు అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నాం. మాకు సెన్సారు యు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి చాలా అనందంగా వుంది. మా ఆర్టిస్టులు , నటీనటులు అందరూ చాలా చాలా బాగా చేసారు. దియోటర్ కి రండి తప్పకుండా మంచి అనుభవాన్ని అందిస్తాం. అని అన్నారు

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి
దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను, ధీరు, ప్రసాద్ లింగం
సంగీత దర్శకులు: అజయ్ అరసడ
సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్
ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్

Eluru Sreenu
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES