సమాజానికి ఉపయోగ పడే మంచి కాన్సెప్ట్ సినిమాలంటే నాకెంతో ఇష్టం…”డర్టీ ఫెలో” మూవీ టీజర్ వేడుకలో హీరో శ్రీకాంత్

121

ఒక తండ్రి తనకొడుకుని సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే “డర్టీ ఫెలో” శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ వెళ్లిన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో శ్రీకాంత్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. అనంతరం….

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తల్లి, తండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణలో పెంచకపపోతే ఆ పిల్లలు ఏవిధంగా తయారు అవుతారనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది.దర్శకుడు ఆడారి మూర్తి సాయి ఈ సినిమాను చాలా బాగా తీశాడు. టీజర్ కూడా చాలా బాగుంది.చిత్ర హీరో శాంతి చంద్ర బిజినెస్ లో ఎంతో బిజీగా ఉన్నా తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఇలాంటి వారు కచ్చితంగా ఇండస్ట్రీకి రావాలి. అలాగే డాక్టర్ గా ఎంతో బిజీగా ఉన్న సతీష్ కుమార్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా గ్రేట్. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ…..మా టీజర్ విడుదల చేయడానికి వచ్చిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు. నేను శివ భక్తున్ని. సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం.అయితే ఛాలెంజింగ్ లైఫ్ పేస్ లో ఉన్న నేను సినిమా ఇండస్ట్రీలొకి రానేమో అనుకున్నాను. అయితే శివుడు ఆశీస్సులతో ఎటువంటి ఆవరోదం రాకుండా ఈ సినిమా పూర్తి చెయ్యడం జరిగింది. సినిమా టైటిల్ కంప్లీట్ నెగిటివ్ గా ఉన్నా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది.ప్రస్తుత సమాజంలో తల్లి, తండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణలో పెంచకపపోతే వారు ఎలా తయారవుతారు , తద్వారా సమాజానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేటటువంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమానే “డర్టీ ఫెలో”. నాసిక్, అరకు, వైజాగ్ వంటి ప్రదేశాల్లో రెయిన్ సీజన్ లో చాలా కష్టపడి చేశాము. అందుకు డాక్టర్ సతీష్ కుమార్, వీరశంకర్ గార్లు ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకు వారికి నా ధన్యవాదములు. సతీష్ గారు ఇచ్చిన పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మంచి మెసేజ్ తో వస్తున్న సినిమాలను ఈ మధ్య ప్రేక్షకులు అదరిస్తున్నారు. అలాంటి అన్ని అంశాలు ఈ సినిమాలోను ఉన్నాయి.అన్ని కార్యకార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ.. నాయకుడుగా, ప్రతి నాయకుడుగా అతి తక్కువ కాలంలో 125 సినిమాలు పూర్తి చేసుకున్న హీరో శ్రీకాంత్ గారు చేతుల మీదుగా నా సినిమా టీజర్ ను విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా హీరో శాంతి చంద్ర, దర్శకులు వీరశంకర్,నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడం వలన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమా లో ఉన్నాయి. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరోయిన్ దీపికాసింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కొరకు అందరం చాలా హార్డ్ వర్క్ చేశాము. మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ సిమ్రిత్ బతీజా మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్.సతీష్ కుమార్ మాట్లాడుతూ. శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకే చిన్నప్పటి నుండి గిటార్ వాయించేవాన్ని. అయితే నేను మెడికల్ ఫీల్డ్ కు వెళ్లి బిజీగా ఉన్నా నాకు టైం దొరికినప్పుడల్లా మ్యూజిక్ చేసే వాన్ని . అయితే నా డ్రీమ్ ను పూర్తి చేసుకొనే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. సినిమా అందరికి నచ్చుతుంది అని అన్నారు.

దర్శకులు వీరశంకర్ మాట్లాడుతూ..శాంతి చంద్ర నాకు మంచి ఫ్రెండ్. తనకు సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న బడ్జెట్ తో చేసిన ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఇది తమ సొంతసినిమా అని ఓన్ చేసుకొని ఈ సినిమా చేశారు. అందుకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటి నటులు:
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : శ్రీమతి గుడూరు భద్ర కాళీ
బ్యానర్ : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : జి.యస్. బాబు.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆడారి మూర్తి సాయి
డి. ఓ. పి : రామకృష్ణ. యస్.
మ్యూజిక్: డాక్టర్. సతీష్ కుమార్.పి.
ఎడిటర్ : జేపీ
ఫైట్స్ : శంకర్
కొరియోగ్రఫీ : కపిల్ & ఈశ్వర్