స్వాతి మూవీస్ పతాకంపై అరుణ్ ఆదిత్య, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా కొత్త చిత్రం ప్రారంభం !!!

649

స్వాతి సినిమాస్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మాతగా చాణక్య చిన్న దర్శకత్వంలో అరుణ్ ఆదిత్య, పూజిత పొన్నాడ జంటగా నాటిస్తోన్న “కథ కంచికి మనం ఇంటికి” అనే చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. జి.హరినాధ్ నేతృత్వంలో డి.సురేష్ బాబు నిర్మాతగా పిక్ ‌న్ హుక్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత డి.సురెష్ బాబు, జి.హరినాధ, శివకుమార్, పిక్ న్ హుక్ సిఇఒ మొనీష్ పత్తిపాటి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చాణక్య చిన్న మాట్లాడుతూ…. ఈ చిత్రం సరికొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని తెలిపారు.

నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ…. ఈ సినిమా మా ప్రొడక్షన్ లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయే సినిమా ఇది. ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తామని తెలియజేసారు.

ఈ చిత్రంలో మురళి శర్మ, సత్యం రాజేష్, జయ ప్రకాష్, సాహితి, సత్య, హర్షిని రాయ్, జాహ్నవి, బిందు తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

మాటలు:శ్రీనివాస్ తేజ్
కెమెరామెన్: వై.ఎస్ కృష్ణ
సంగీతం: భీమ్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాండు
పిఆర్ఒ: ఏలూరు శ్రీను
నిర్మాత: డి.సురేష్ బాబు
వి.ఎఫ్.ఎక్స్: దుర్గ ప్రసాద్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చాణక్య చిన్న