ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ మొదటిగా మా సూర్యాస్తమయం సినిమా ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు,సినిమా లో తన పాత్ర నిడివి తగ్గించారు అని తను బాగా తీసిన సీన్స్ కట్ చేసారు అని చెప్తున్నాడు అని అల ఎవ్వరు చెయ్యరు బండి సరోజ్ కుమార్, లెంగ్త్ ఎక్కువ వున్న సీన్స్ కానీ బోరింగ్ వున్న సీన్స్ తీసివేయటం మాత్రమే జరిగింది, ఈ మూవీ ఆర్టిస్టులని ప్రెస్ మీట్స్ కి రానివ్వకుండా అడ్డుపడ్డాడు, తను రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెడితే మా అన్నయ్య మరియు నా ఫ్రెండ్స్ ఈ మూవీ హీరో ప్రవీణ్ రెడ్డి మాట్లాడటానికి వెళితే రౌడీలు లాగా వచ్చి నా ప్రెస్ మీట్ అడ్డుకున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి కి ఈ సినిమా తో మంచి భవిష్యత్తు ఉండాలి అని ఈ మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని ముందుకు వస్తే నన్ను ఇన్వెస్టర్ అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో, అన్నింట్లో నువ్వు తల దూర్చినా మేము ఏమి మాట్లాడలేదు, సినిమా ప్రొమోషన్స్ కి రావు నిన్ను తదుపరి మూవీస్ కి ఏ ప్రొడ్యూసర్ అయినా నిన్ను నమ్మి సినిమా తీయటానికి ఎలా ముందుకు వస్తాడు, నువ్వు సినిమా తీసి యూట్యూబ్ లో పెట్టి వంద రూపాయలు తీసుకుంటావు అంటే నువ్వు ఒక్కడివే బావుండాలి మిగతా వాళ్లంతా బావుండనవసరం లేదా బండి సరోజ్ ఒకటి గుర్తు పెట్టుకో మేము ఎంత మంచి వాళ్ళమో నీకు తెలుసు ఇకపై అయిన మంచి ప్రవర్తన తో ప్రవర్తించు అని ప్రొడ్యూసర్ రఘు గారు మాట్లాడారు.
నటీనటులు:
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో, మాస్టర్ రక్షిత్, మాస్టర్ చరణ్, మోహన్, వివేక్ థాకూర్, నందగోపాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్మెంట్
సంగీతం, పాటలు, స్టంట్స్, ఎడిటింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బండి సరోజ్
నిర్మాత: క్రాంతి కుమార్ తోట.
PRO.Tejaswi Sajja