సూర్యాస్త‌మ‌యం” మూవీ ప్రేక్షకులు ప్రశంసలను అందుకుంటుంది-నిర్మాత క్రాంతి కుమార్ తోట

460


ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్త‌మ‌యం`. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్ తోట నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది.

నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ “ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్త‌మ‌యం` సినిమా చేయ‌డానికి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి, అలాగే ఇతర నటి నటులు హిమన్షి,కావ్యా సురేశ్పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో, మాస్ట‌ర్ ర‌క్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్, మోహ‌న్‌, వివేక్ థాకూర్‌, నంద‌గోపాల్‌ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.అలాగే ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదిక గా తప్పుడు వదంతులని నమ్మకండి మా సినిమా ని ఆదరించండి అని మీడియా వేదిక గా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని మాట్లాడారు.

ప్ర‌వీణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మూవీ కి మంచి స్పందన వస్తుంది, అలాగే ఈ మూవీ లో నాకు ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ తోట గారికి నేను ఎప్పుడు రుణపడి వుంటాను,ఈ మూవీ ని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా నిర్మించారు,అలాగే నాతోటి సహా నటి నటులు అందరకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,ఈ మూవీ ని ఆధరంచి మరింత విజయాన్ని అందించి ఇటువంటి నిర్మాత ను మరిన్ని మూవీస్ నిర్మించేలా ప్రోత్సవహించాలి అని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ రఘు గారు మాట్లాడుతూ మా సూర్యస్తమయం సినిమాకి మంచి స్పందన వచ్చింది, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మా ధన్యవాదములు, ఈ మూవీ లో నటించిన ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా ఈ మూవీ మరో మెట్టు కు తీసుకెళ్లింది,ఈ మూవీ లో నటించిన ఇతర నటీనటులు కూడా బాగా నటించారు,శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్ ఎక్కడ కూడా రాజి పడకుండా మూవీ ని తెరకెక్కించారు,వాళ్ళకి కూడా నేను హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.

న‌టీన‌టులు:
ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో, మాస్ట‌ర్ ర‌క్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్, మోహ‌న్‌, వివేక్ థాకూర్‌, నంద‌గోపాల్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్: శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్
సంగీతం, పాట‌లు, స్టంట్స్‌, ఎడిటింగ్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: బండి స‌రోజ్
నిర్మాత‌: క్రాంతి కుమార్ తోట‌.