ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదకానున్న నేపధ్యంలో హీరో యష్ పూరి చిత్ర విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.
ఈ వారం దాదాపు 20 సినిమాలు వస్తున్నాయి కదా.. అందులో మీ ‘చెప్పాలని ఉంది’ కూడా వుంది. ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ?
సినిమాల విషయంలో ఒత్తిడి లేదు కానీ నా కెరీర్ మొదలౌతుందనే ఒత్తిడి వుంది. కానీ ‘చెప్పాలని ఉంది’ పట్ల చాలా నమ్మకంగా వున్నాను. 94 చిత్రాలు నిర్మించిన ఆర్.బి చౌదరి గారికి ఈ కథ పై చాలా నమ్మకం వుంది. ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా వుంటుంది. అది మాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో కథే పెద్ద హీరో. కథ బావుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఈ వారం వస్తున్న సినిమాల్లో ‘చెప్పాలని ఉంది’ మొదటి రెండు స్థానాలలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.
తొలి సినిమానే సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఎలా కుదిరింది ?
ఇది నా అదృష్టం. ఐదేళ్ళు నటన నేర్చుకున్నాను. మూడేళ్ళు ముంబైలో కోర్స్ చేశాను. ముంబైలో దాదాపు మూడు వేలకు పైగా ఆడిషన్స్ ఇచ్చాను. ఇవన్నీ కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికే. ఒకసారి నమ్మకం కుదరగానే ముంబై నుండి హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడే పుట్టి పెరిగాను. తెలుగు సినిమాలో భాగం కావాలనేది నా కల. ఆడిషన్స్ ఇచ్చే క్రమంలో అన్నపూర్ణలో ‘అలాంటి సిత్రాలు’ లో అవకాశం వచ్చింది. అందులో నాలుగు కథలు వుంటాయి. ఓ కథలో కనిపించా. తర్వాత ప్రముఖ సంస్థలలో ఆడిషన్స్ ఇచ్చాను. ఎక్కువ అల్లు అర్జున్ గారి డైలాగ్స్ చెప్పేవాడిని. బన్నీగారు కూడా నాకు ఒక స్ఫూర్తి. ఒకసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి కబురొచ్చింది. చెన్నై రమ్మని చెప్పారు. కథ చెప్పారు. దిని కోసం స్పెషల్ ఒక భాష క్రియేట్ చేశాం. కొరియన్ సౌండింగ్ లో జిబ్రిష్ లాంటి ఒక భాషని సాధన చేసి ఆడిషన్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేశాను. పదిహేను రోజుల తర్వాత నన్ను సెలెక్ట్ చేసినట్లు సూపర్ గుడ్ ఫిల్మ్స్ నుండి కాల్ వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. నటుడు కావడానికి అందరూ కష్టపడతారు. అయితే కొందరికే అదృష్టం ఉంటుందని అనుకుంటాను. ఈ విషయంలో నేను అదృష్ట వంతుడిని. దేవుని దయ నామీద వుందని భావిస్తాను.
నటన పై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?
చిన్నప్పటి నుండి నేను డ్రామాటిక్ నే. మా స్కూల్ లో డ్రామా సొసైటీ మొదలుపెట్టింది నేనే. స్కూల్ వేసిన మొదటి నాటకంలో చెట్టులా నటించాను. అలాగే డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి స్పాట్ లైట్ అంటే ఇష్టం. అయితే నేను క్రికెటర్ కావాలని కల కన్నాను. హైదరాబాద్ రంజీ ట్రోపీ ప్రాబబుల్స్ వరకూ రిప్రజంట్ చేశాను. అయితే కొన్ని కారణాలు వలన క్రికెట్ ని కొనసాగించలేకపోయాను. తర్వాత సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు తొలి సినిమాతో ప్రేక్షకుల ముందు రావడం చాలా ఆనందంగా వుంది. చాలా గ్రేట్ ఫీలింగ్.
మూడు వేల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ జర్నీ కష్టమని అనిపించలేదా ?
నేను మెంటలీ చాలా స్ట్రాంగ్ పర్శన్ ని. బహుసా క్రికెట్ అది నేర్పించింది. గెలుపు ఓటములు క్రికెట్ లో నేర్చుకున్నాను. ఆ అనుభవం ఇక్కడ పెట్టాను. ఎవరైనా నో(కాదు) అంటే.. నాకు నాట్ నౌ (ఇప్పుడు కాదు) అని వినిపిస్తుంది. ఇప్పుడు కాదు రేపు కావచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటాను. ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తాను. డిసెంబర్ 9పైనే నా ద్రుష్టి వుంది. ప్రేక్షకుల సహకారంతో సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.
‘ఒక మాతృభాష కథ’ అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణం ?
ఈ సినిమా మీనింగ్ ని ఒక్క కొటేషన్ లో చెప్పాలంటే.. ‘పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం’. చాలా బలమైన మీనింగ్ వున్న కంటెంట్ ఇది. అయితే ఇది సందేశం చెప్పేలా వుండదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. కామెడీ, డ్రామా, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. అయితే ఇవన్నీ ఒక ప్యాకేజీలా వుండవు. స్టొరీ డిమాండ్ చేసింది కాబట్టే ఈ ఎలిమెంట్స్ అన్నీ కుదిరాయి. ఏదీ బలవంతంగా పెట్టింది కాదు. ఇందులో ప్రతి పాత్రకు మంచి గ్రాఫ్ వుంటుంది. ఈ సినిమా మొదటి హీరో కథే. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఎంటర్ టైనర్ ఇది.
కాశ్మీర్ షూటింగ్ గురించి చెప్పండి ?
సినిమా తీయడంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ మాస్టర్స్. ఈ సినిమాని అద్భుతంగా తీశారు. చివరి 30 నిమిషాలు విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. కాశ్మీర్ లో చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య చాలా హార్డ్ వర్క్ చేసి షూట్ చేశాం. సినిమా కష్టం ఏమిటో కాశ్మీర్ షెడ్యుల్ లో అర్ధమైయింది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలని కష్టపడి పని చేశాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది.
‘చెప్పాలని ఉంది’ టైటిల్ గురించి చెప్పండి ?
ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తా. సడన్ గా వేరే భాష మాట్లాడుతా. అది ఎవరికీ అర్ధం కాదు. ఆ వేరే భాష నాకు ఎందుకు వచ్చిందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ వేరే భాష కారణంగా చాలా సమస్యలు వస్తాయి. నా దగ్గర వున్న వాళ్ళు దూరమౌతారు. నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేరు. నాకు ఎదో చెప్పాలని వుంటుంది. కానీ చెప్పలేకపొతుంటాను. దీనికి ‘చెప్పాలని ఉంది’ టైటిల్ యాప్ట్ అనిపించింది. కొరియన్ భాష రిధమ్ ప్రకారం ఒక కొత్త భాషని క్రియేట్ చేశాం. ఈ కొత్త భాష రిధమ్ పట్టుకోవడానికి 15 రోజులు పట్టింది. ఈ కొత్త భాష ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేలా స్క్రిప్ట్ చేశాం. అలాగే బాడీ లాంగ్వేజ్ తో కూడా భావం అర్ధమౌతుంది.
‘చెప్పాలని ఉంది’ సినిమా నాకు దొరికిన పెద్ద అదృష్టం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంచ్ చేయడం ఒక ప్లస్ పాయింట్. కథ, తారాగణం, మ్యూజిక్, డీవోపీ.. అన్నీ ప్లస్ పాయింట్స్. హమ్స్టాక్ సంస్థ ఈ సినిమా మూడో షెడ్యుల్ తర్వాత ఇందులో భాగమైయింది. నిర్మాణంలో హమ్స్టాక్ భాగస్వామ్యం తక్కువే. కానీ ఆర్ బి చౌదరి గారు గొప్ప మనసుతో పేరు పెట్టుకునే అవకాశం ఇచ్చారు.
ట్రైలర్ లో చాలా యాక్టివ్ గా కనిపించారు ? తెలుగులోఎవరినైనా అనుకరించారా ?
ఇమిటేట్ చేయడనికి నేను ఇంకా అంత బలమైన నటుడిని కాలేదు. నాకు స్ఫూర్తి రోజువారీ జీవితం నుండి వస్తుంది. ఇందులో చంద్ర శేఖర్ అనే రిపోర్ట్ గా కనిపిస్తా. దిని కోసం కొంతమంది రిపోర్ట్లని కలిశాను. వారికీ సహాయకుడిగా కూడా పని చేశాను. వారిని దగ్గరుండి పరిశీలించాను. ఈ సినిమా చేసిన తర్వాత మీడియా కమ్యునిటీ మీద గౌరవం మరింతగా పెరిగింది. దర్శకుడు అరుణ్ గారు మీడియా కమ్యునిటీని అద్భుతంగా చూపించారు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సిల్లీ మాంక్ తో ఒక సినిమా చేశా. అది కూడా క్యూట్ స్టొరీ.