“శ్రీదేవి సోడా సెంటర్”.ప్రి రిలీజ్ ఈవెంట్

430

రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ “శ్రీదేవి సోడా సెంటర్” ఉంటుంది.. చిత్ర నిర్మాతలు  విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. స్వ‌ర మాంత్రికుడు సంగీత ద‌ర్శ‌కుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.తను ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాట‌ను మెగాస్టార్ చిరంజీవి గారు విడుద‌ల చేశారు. ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హీరో ప్రభాస్ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ “శ్రీదేవి సోడా సెంటర్” హక్కులను ఫాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని “N” కన్వెన్షన్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అనిల్ రావిపూడి, అజయ్ భూపతి, బుచ్చిబాబు, శ్రీరామ్ ఆదిత్య, హర్షవర్ధన్, సుధీర్,రమణ తేజ, నిర్మాతలు అదిశేషగిరి రావు, రాజ్ కందుకూరి, విష్ణు, హీరో కార్తికేయ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. శ్రీదేవి సోడా సెంటర్” మొదటి బిగ్ టికెట్ ను హీరో సుధీర్ బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా అనిల్ రావిపూడి, కార్తికేయలు ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.అనంతరం

చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. సుధీర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక మాట అడగ్గానే మమ్మల్ని పిలిచి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి మందులోడా ఓరి మాయలోడా సాంగ్ ను రిలీజ్ చేశారు.వారికి మా చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసు కుంటున్నాము.ఈరోజు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి పలాస సినిమానే కారణం ఆ సినిమా అవకాశం ఇచ్చిన అట్లూరి వరప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ఆ ప్రాజెక్టుని బ్యాక్ ఉండి నడిపించిన అప్పారావు, తమ్మారెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ప్యాండమిక్ టైం లో నేను తీసిన సినిమా చూసి నన్ను పిలిచి మాట్లాడి అభినందించారు. సుధీర్ బాబు.12 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండి కూడా నేను చెప్పిన కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.

చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ.. ముందుగా మెగాస్టార్ చిరంజీవి కి మా చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసు కుంటున్నాము.మా సినిమాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మాకు సపోర్ట్ గా నిలిచిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ గార్లకు కృతజ్ఞతలు.ఈ సినిమా తర్వాత దర్శకుడికి చాల ప్రాజెక్ట్స్ వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న వస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్” అందరినీ తప్పక ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.ప్రేక్షకులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. మా సినిమాను ఆశీర్వదించాలని కి వచ్చిన పెద్దలకు ,ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మొదటగా చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే మందులోడా సాంగును రిలీజ్ చేశారు. మా సమ్మోహనం మూవీ కూడా ఆయాన సపోర్టుతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాము.ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గురువు గారు మెగాస్టార్ తో స్టార్ట్ చేశాము. ఈ నిర్మాతలు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేస్తారనే నమ్మకం ఉంది..గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.నేను రొటీన్ సినిమాలు చెయ్యను డిఫరెంట్ గా ఉండే కథల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఎందుకు చెప్పానో ఈ నెల 27న రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

నటీనటులు :
సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు

టెక్నికల్ టీం:
ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ప.. రామ‌కృష్ణ‌- మౌనిక‌
క‌థ‌.. నాగేంద్ర కాషా
కొరియొగ్రాఫ‌ర్స్‌.. ప్రేమ్ ర‌క్షిత్‌, విజ‌య్ బిన్ని, య‌శ్వంత్‌
యాక్ష‌న్‌.. డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కె ఎన్ ఆర్ (నిఖిల్‌) , రియ‌ల్ స‌తీష్
లిరిక్స్‌.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి, కాస‌ర్ల శ్యామ్‌
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌

Eluru Sreenu
P.R.O