శ్రీ సింహాకొడూరి, సతీష్ త్రిపుర, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ ప్రారంభం.

289


టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహా కొడూరి రెండు చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం శ్రీ సింహా కొడూరి హీరోగా న‌టిస్తోన్న మూడ‌వ చిత్రం `దొంగలున్నారు జాగ్రత్త`. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైందని అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్‌

చిత్రయూనిట్ సరైన అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఒక ప్ర‌త్యేక‌మైన‌ ముద్ర వేశారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన‌ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ మెమోరీ కార్డును దొంగలించడం గురించి ఉంది. దాన్ని బట్టి సినిమా కథ ఏంటి? హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక ఈ వీడియోలోనే సాంకేతిక బృందాన్ని కూడా పరిచయం చేశారు.

సముద్రఖని లాంటి అద్భుతమైన నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర ద‌ర్శ‌కుడు. రోహిత్ కులకర్ణి సంగీత దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌.

తారాగ‌ణం: శ్రీ సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని

సాంకేతిక వ‌ర్గం:
ప్రొడక్షన్ కంపెనీ: సురేష్ బాబు, గురు ఫిల్మ్స్
నిర్మాత: డి సురేష్ బాబు, సునిత తాటి
డైరెక్టర్: సతీష్ త్రిపుర
కెమెరామెన్: యశ్వంత్ సీ
సంగీతం: రోహిత్ కులకర్ణి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
లైన్ ప్రొడ్యూసర్: డి రామ బాలాజీ
మార్కెటింగ్: లిపిక అల్ల
పీఆర్వో : వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385