శ్రీపిక్చర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం `బాయ్స్` ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. `రథం` ఫేమ్ గీతానంద్, శ్రీహాన్, రోనిత్ రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీ ఫర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ స్వరూప్, మేల్కొటి, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. నేహాశర్మ నిర్మాత. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టి, డైరెక్టర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. `రథం నిర్మాత రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత సుప్రియ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పూజా కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ – “దర్శకుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. మంచి టీమ్ కుదిరింది. కథ నచ్చగానే నిర్మాతలు వెంటనే సినిమాను చేయడానికి అంగీకరించారు. వారికి నా థ్యాంక్స్“ అన్నారు.
నిర్మాత నేహాశర్మ మాట్లాడుతూ – “న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా మా బాయ్స్ సినిమా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైదరాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటలను చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 4 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం“ అన్నారు.
నటీనటులు:
గీతానంద్, శ్రీహాన్, రోనిత్ రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీ ఫర్, సంజయ్ స్వరూప్, మేల్కొటి, ఉత్తేజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్, మ్యూజిక్: స్మరణ్(RX 10 బ్యాగ్రౌండ్ స్కోరర్), కొరియోగ్రఫీ: శివశంకర్ మాస్టర్, జావెద్, డిజైనర్: పి.శ్యామ్, పి.ఆర్.ఒ: తేజస్వి సజ్జ, ప్రొడక్షన్ కంట్రోలర్: బెక్కం రవీందర్, కో ప్రొడ్యూసర్: బాలచంద్ర, ప్రొడ్యూసర్: నేహాశర్మ, రచన, దర్శకత్వం: దయానంద్.
Attachments area