స్పీడ్‌ 220” సెప్టెంబర్‌ 6న వరల్టే వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌”

25

గణేష్‌, హేమంత్‌, ప్రీతి సుందర్‌, జాహ్నవి యాక్ట్‌ చేసిన చిత్రం ‘స్పీడ్‌ 220″. తాజాగా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్‌లో చిత్ర యూనిట్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఆ

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు కె.ఫణి, యం.సూర్యనారాయణ & యం.దుర్గారావు లు మాట్లాడుతూ… “నేటి యువతకు మంచి మెసేజ్‌తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. ఇద్దరు హీరోలు పోటా పోటీగా చాలా బాగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కథనం ఈ చిత్రంలో వుంది. “స్పీడ్‌ 220” సెప్టెంబర్‌ 6న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఫ్యామిలీ, యూత్‌ అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయొచ్చు. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్‌ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని డిసైడ్‌ అయ్యాము” అని అన్నారు.

చిత్ర దర్శకుడు హర్ష బేజాగం మాట్లాడుతూ… “నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్‌ అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్‌ మోపురి అందించారు. కెమెరామెన్‌ గా క్రాంతి కుమార్‌ వ్యవహరించారు. మరోవైపు ఎడిటర్‌ గా రామకృష్ణ వ్యవహరించారు. చిత్రాన్ని ప్రేక్షకులు
ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు.

హీరోలు గణేష్‌, హేమంత్‌లు మాట్లాడుతూ… ‘మాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి మా అందరికీ లైఫ్‌ ఇస్తారనే నమ్మకంతో వున్నాం” అని అన్నారు.

కొరియోగ్రఫీ : ఏషర్‌ మామిడి, ఫైట్స్‌ : స్టార్‌ మల్లి, ఎడిటర్స్‌ : రామకృష్ణ అర్రం, రత్నాకర్‌ పేర్వలి, డి.ఒ.పి. క్రాంతి కుమార్‌, సంగీతం : శేఖర్‌ మోపూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : యం.పెదకాపు, నిర్మాతలు :కె.ఫణి యం. సూర్యనారాయణ & యం. దుర్గారావు, దర్శకులు : హర్ష బేజాగం.