అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం

24

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబీ’ చిత్రం నేడు నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు. ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని ఆశీర్వదిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్ డైరెక్ట్ చేసారు.

ఈ రోజుల్లో,భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,ప్రతి రోజు పండగే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామి గా ఉండి, విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కే. ఎన్ & మారుతి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెప్పారు.

విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే,పుష్ప లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు.

నిర్మాత: ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
ఛాయాగ్రాహనం: రామ్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
కళ: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎక్సుటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
చీఫ్. సహా దర్శకుడు: మహేష్ అలంశెట్టి
నృత్యం: విజయ్ పొలంకి

పి.ఆర్.ఓ: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా