సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రణస్థలి”

261

ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమాకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా

చిత్ర నిర్మాత అనుపమ సూరెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తి చేసుకున్న మా రణస్థలి చిత్రానికి సెన్సార్ సభ్యులు సినిమా చూసి క్లీన్‌ ఎ సర్టిఫికెట్‌ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి,మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను.  సెన్సార్‌ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్‌ కరెక్టే అని అర్థమయింది.మేము విడుదల చేసిన ‘‘రణస్థలి ’’ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. “అశ్వద్దామా ” సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరశురామ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచన దర్శకత్వం చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడి  పూర్తి చేశాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

నటీ నటులు
ధర్మ (హీరో) చాందిని రావు(హీరోయిన్), ప్రశాంత్, శివ,అశోక్ సంగా తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : సూరెడ్డి విష్ణుగారి
బ్యానర్ : A J ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాత : అనుపమ సూరెడ్డి
కో ప్రొడ్యూసర్ : లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్
దర్శకుడు : పరశురాం శ్రీనివాస్
మ్యూజిక్ : కేశవ్ కిరణ్
కెమెరామెన్ : జాస్టి బాలాజీ, ,
ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్
అసిస్టెంట్ డైరెక్టర్ : మూర్తి,
కెమెరా అసిస్టెంట్ : సాయి
పీ. ఆర్ ఓ : హరీష్, దినేష్