*శివ 143 సాంగ్ విడుదల చేసిన డైరెక్టర్ పరుశురాం. జనవరి 12న శివ 143 విడుదల !!!*

524

గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు పరశురాం చేతుల మీదుగా శివ 143 సాంగ్ విడుదల జరిగింది.

ఈ సందర్భంగా పరశురాం గారు మాట్లాడుతూ…. దర్శకుడు సాగర్ శైలేష్ నాకు చాలా కాలంగా తెలుసు ట్రైలర్స్..సాంగ్స్ చూసాను చాలా బాగున్నాయి. ఈ రోజు చిన్న బడ్జెట్ సినిమా కి చాలా ఇబ్బందులు ఉన్నాయి.. కానీ వాటిని అధికమించి శివ143 ఇంత బాగా రావటానికి కారణం సీనియర్ నిర్మాత రామ సత్యనారాయణ గారి కి అన్ని కష్ట సుఖాలు తెలుసు కావున ఆయన సినిమాను మంచి థియేటర్స్ లో విడుదల చేసి సక్సెస్ చేస్తాడన్న నమ్మకం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కొత్త వాడైన బాగా చేసాడు. పాటలు బాగున్నాయి. కెమెరామెన్ సుధాకర్, డిఐ ఎడిటింగ్ శివ ప్రసాద్..ఈ చిత్రానికి ప్లస్ అవుతారు.హీరోయిన్ చాలా బాగుంది..ఈ సాంగ్ హిట్ అవుతాదీ..జనవరి 12 న విడుదల కి ప్లాన్ చేయటం అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఉన్న వనరులతో చాలా కష్టపడి శివ 143 తీసాడు..విజయానికి దగ్గరలో వున్నాడు మా సాగర్ శైలేష్ అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ….
డైరెక్టర్ పరుశురాం బిజీగా ఉన్నా మా సాంగ్ కోసం సమయం కేటాయించి విడుదల చేశారు, ఆయన సపోర్ట్ మరువలేనిది. అందుకు పరుశురాం గారికి ధన్యవాదాలు. మా శివ 143 చిత్రం జనవరి 12న సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

హీరో, డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ….
మా యూనిట్ కు సపోర్ట్ చేస్తున్న పరుశురాం గారికి థాంక్స్. పరుశురాం గారు విడుదల చేసిన సాంగ్ సినిమాలో సందర్భానుసారం వస్తుంది, ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటుంది. జనవరి 12న మా సినిమాను సపోర్ట్ చెయ్యమని ఆడియన్స్ ను కోరారు.

నటీనటులు: సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: జె.కరుణ కుమార్
నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి
కథ – మాటలు: జక్కా హరిప్రసాద్
సంగీతం: యాజమాన్య
లిరిక్స్: రాంబాబు గోషల
పీఆర్ఓ: మధు వి.ఆర్