HomeTeluguసెల్ఫీష్. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !

సెల్ఫీష్. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !


రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో ఆశిష్ పూర్తి మాస్‌లుక్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తారు. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్, లిరిక్స్: చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్‌కుమార్ మన్నె, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. పీఆర్‌ఓ: వంశీ కాక, మడూరి మధు



Madhu PRO
9849162675

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES